Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్రిపుల్ సెంచరీ సరే, జట్టులో వేటు గురించి మాటల్లేవ్..: కరుణ్ నాయర్

I am a much improved batsman than what I was two years ago, says Karun Nair

హైదరాబాద్: టీమిండియా తరపున ఆడి ట్రిపుల్ సెంచరీ సాధించింది వీరేంద్ర సెహ్వాగ్.. తర్వాత కరుణ్ నాయర్. అలాంటి నాయర్‌ను టెస్ట్ మ్యాచ్‌ల నుంచి అతనిని వేటుకు గురి చేసి.. రహానె తిరిగొచ్చాడని సాకులు చెప్పింది టీమిండియా మేనేజ్‌మెంట్. అలాంటి సమయంలో ఆవేదనకు గురి కాకుండా.. దేశవాళీ, ఐపీఎల్ 2018 సీజన్‌లో మెరుగ్గా రాణించి మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అఫ్గానిస్థాన్‌తో బెంగళూరు వేదికగా గురువారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుండగా.. విరాట్ కోహ్లి స్థానంలో జట్టులోకి కరుణ్ నాయర్ ఎంపికైన విషయం తెలిసిందే. అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడకుండా ఇంగ్లాండ్‌లో కౌంటీలు ఆడేందుకు వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్న కోహ్లి.. అనంతరం గాయం కారణంగా ఆ ఆలోచనని విరమించుకున్నాడు.

'టీమిండియాకి ఏడాదిన్నర కాలంగా దూరంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌తో పాటు ఆటలో నైపుణ్యం సాధించాను. దేశవాళీలో పరుగులు చేయడంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. రెండేళ్ల క్రితం పోలిస్తే.. నా ఆటతీరు కూడా మెరుగైంది. అందరూ అనవసరంగా ఆ ట్రిఫుల్ సెంచరీ ఇన్నింగ్స్‌ తర్వాత వేటు గురించి మాట్లాడుతున్నారు. నేను దాని గురించి ఆలోచించడం లేదు. భారత్ తరఫున రెండో ట్రిఫుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు రావడం హ్యాపీ. ఆ తర్వాత వాటి గురించి చర్చ అనవసరం. మళ్లీ త్రిశకం సాధిస్తే మంచిదే. కానీ.. ఆ రికార్డుల గురించి కాకుండా జట్టు అవసరాలకి తగినట్లుగా ఆడటానికే ప్రాధాన్యమిస్తా' అని కరుణ్ నాయర్ వెల్లడించాడు.

2016, డిసెంబరులో చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 381 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 303 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ తర్వాత 2017, ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కరుణ్ నాయర్‌ని ఆడించలేదు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రహానె రెండు ఇన్నింగ్స్‌ల్లో 13, 18 పరుగులకే ఔటవగా.. భారత్ 303 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో కరుణ్ నాయర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Tuesday, June 12, 2018, 11:06 [IST]
Other articles published on Jun 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+