కోహ్లీపై ఉన్న గౌరవం పోతుంది: 'టాయిలెట్' స్లెడ్జింగ్‌పై హేలీ
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్నరెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు కించపరిచే విధంగా ఉందని ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ మండిపడ్డాడు. ఈ తరహా చర్యలతో విరాట్ కోహ్లీపై గౌరవం తగ్గిపోతున్నదని అన్నాడు.
అంతేకాదు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కోహ్లీ ఊరికే స్లెడ్జింగ్ చేస్తుండటంపై అతను అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ప్రత్యర్థి ఆటగాడిని 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం అతడిని అగౌరపరచడమేనని అన్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కోహ్లీ వ్యవహరించిన తీరు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదని తెలిపాడు.
మైదానంలో కోహ్లీ ఈ తరహా మాటల యుద్ధానికి పుల్ స్టాఫ్ పెట్టి తన సహజ సిద్దమైన ఆటను ప్రదర్శిస్తే బాగుటుందని సూచించాడు. కోహ్లీ దూకుడు తన జట్టు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుందని, అశ్విన్ మొహంలౌ అది స్పష్టంగా కనిపిస్తోందని హేలీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీపై ఒత్తిడి వల్లే ఇదంతా
'కోహ్లీపై ఒత్తిడి పెరుగుతున్నదని అర్థమవుతోంది. అతనిపై ఉన్న గౌరవం పోతోంది. ప్రత్యర్థులతో అతను గౌరవంగా వ్యవహరించాలి. స్టీవ్ స్మిత్‌తో అతను వ్యవహరించిన తీరు సరైంది కాదు' అని హేలీ అన్నాడు. గతంలో ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను విరాట్ కోహ్లీ ఈ తరహాలో కించపరచలేదని చెప్పాడు.

కోహ్లీ తన గౌరవాన్ని కోల్పోతున్నాడు
దీనిని బట్టి చూస్తే ఒత్తిడికి లోనవుతున్న కోహ్లీ తన గౌరవాన్ని కోల్పోతున్నట్లు కనబడుతుందని అన్నాడు. భారత జట్టు కెప్టెన్ కాకముందు అతని దూకుడు భిన్నంగా ఉండేదిని, అదే సమయంలో చూడ ముచ్చటగా కూడా ఉండేదని అన్నాడు. ఇప్పుడు మాటలతో దూకుడుగా ఉన్నాడని, అయితే ఆ దూకుడు పనికి రాదని హేలీ అభిప్రాయపడ్డాడు.

మాటల్ని తగ్గించి ఆటతో సమాధానం చెబితే బాగుంటుంది
అంతేకాదు విరాట్ కోహ్లీ విరాట్ మాటల్ని తగ్గించి ఆటతో సమాధానం చెబితే బాగుంటుందని హేలీ కాస్తంత వ్యంగ్యంగా స్పందించాడు. అయితే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సిరీస్ ఉత్కంఠగా సాగుతున్న తీరు చూస్తే.. ఇలాంటివి సహజమేనని, అయితే రెండు జట్లు హద్దు మాత్రం మీరలేదని అన్నాడు.

భిన్నంగా స్పందించిన సైమన్ కటిచ్
అయితే ఫీల్డ్‌లో ఇలాంటి పరిస్థితులను కోహ్లీ, స్మిత్‌లు ఎంతో పరిణతితో ఎదుర్కొన్నారని చెప్పాడు. కాగా, రెండో టెస్టులో రెండో రోజైన ఆదివారం కెప్టెన్ కోహ్లీకి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ రెన్ షాల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఓపెనర్ రెన్ షాను 'టాయిలెట్' అంటూ కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే.

స్టీవ్ స్మిత్, రెన్ షాలను మాటలతో రెచ్చగొట్టిన కోహ్లీ
బెంగళూరు టెస్టు రెండో రోజు కోహ్లి తరచూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ మ్యాట్ రెన్ షాలను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తొలి టెస్టులో రెన్ షా టాయిలెట్ బ్రేక్ తీసుకోవడాన్ని ఆదివారం నాటి ఆటలో భాగంగా మళ్లీ టాయిలెట్‌కు వెళ్తావా అంటూ రెన్షాను కోహ్లీ కవ్వించే యత్నం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications