Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను అమాయకుడ్ని: షోయబ్ మాలిక్

Shoaib Malik
హైదరాబాద్: తాను అమాయకుడిని అని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పోలీసులతో చెప్పినట్లు సమాచారం. సోమవారం ఉదయం సానియా మీర్జా నివాసంలోని ఓ గదిలో పోలీసులు షోయబ్ ను విచారించారు. ఈ విచారణకు సానియా కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయేషా కుటుంబం తనను మోసం చేసిందని షోయబ్ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. న్యాయ విచారణలో అన్నీ తేలుతాయని కూడా ఆయన అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, షోయబ్ కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు ఈ ఆంక్షలు పెట్టారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. షోయబ్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అయేషా కుటుంబ తనను మోసం చేసిందని చెప్పిన షోయబ్ అందుకు సంబంధించిన పత్రాలేవీ సమర్పించలేదని తెలుస్తోంది. షోయబ్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+