Venkatesh Iyer: కేరీర్ బిగినింగ్‌లో రైట్ హ్యాండ్ బ్యాటింగ్: తన ఆరాధ్య దైవం కోసం లెఫ్ట్ హ్యాండ్ స్టైల్

Venkatesh Iyer Replicate Dada, Ganguly అంటే ఇంత పిచ్చా.. ఏకంగా దాన్నే మార్చేసాడు!! | Oneindia Telugu

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మారుమోగుతోన్న పేరు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer). రెండే రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్ స్టార్‌గా మారిపోయాడు. ఓవర్ నైట్ స్టార్‌డమ‌ను సొంతం చేసుకున్నాడు. కొత్త బంతిని ఎదుర్కొనడంతో తనకు తిరుగులేదని నిరూపించుకుంటోన్నాడీ కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి దిగి.. సుదీర్ఘ ఇన్నింగ్‌ను ఆడుతున్నాడు. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై తుఫాన్‌లా విరుచుకుపడుతున్నాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్.

 రూ. 20 లక్షలకే..

రూ. 20 లక్షలకే..

వెంకటేష్ అయ్యర్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. కోల్‌కత నైట్ రైడర్స్ అతణ్ని బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. స్టాండ్ బై ఆటగాడిగా తీసుకుంది. భారత్ పిచ్‌లపై ముగిసిన ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌లో అరంగేట్రం చేయలేదు. వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మారిన తరువాత తన వ్యూహాన్ని మార్చుకుంది నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్. ఓపెనర్‌గా వెంకటేష్ అయ్యర్‌ను బరిలోకి దిగింది. ఏ ముహూర్తంలో ఈ నిర్ణయం తీసుకుందో గానీ.. అద్భుతంగా పని చేస్తోందా మంత్రం.

 ఆడింది రెండు మ్యాచ్‌లే

ఆడింది రెండు మ్యాచ్‌లే

వెంకటేష్ అయ్యర్ ఇప్పటిదాకా రెండు మ్యాచ్‌లే ఆడాడు. సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఓపెనర్‌గా తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన తొలి మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఛేదించాల్సిన లక్ష్యం 92 పరుగులే కావడంతో అర్ధసెంచరీ చేయలేకపోయాడు. గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ కొరతను పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచుల్లో అతని స్ట్రైకింగ్ రేట్ 164.91.

సౌరవ్ గంగూలీకి బిగ్ ఫ్యాన్..

సౌరవ్ గంగూలీకి బిగ్ ఫ్యాన్..

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం వెంకటేష్ అయ్యర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. తాను సౌరవ్ గంగూలీకి బిగ్ ఫ్యాన్ అన్ని చెప్పాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో కోల్‌కత నైట్ రైడర్స్‌కు ఎంపిక కావాలని తాను కోరుకున్నానని, దీనికి కారణం దాదాపై ఉన్న అభిమానమేనని చెప్పుకొచ్చాడు. సౌరవ్ గంగూలీ మొదట్లో నైట్ రైడర్స్‌కు కేప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ తనను కొనుగోలు చేయడంతో తన కల నిజమైందని వ్యాఖ్యానించాడు.

 దాదా కోసమే..

దాదా కోసమే..

క్రికెట్ కేరీర్ ప్రారంభంలో రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాడినని వెంకటేష్ అయ్యర్ చెప్పాడు. సౌరవ్ గంగూలీలా ఆడాలని, అతనిలా లెఫ్ట్ హ్యాండ్‌ సిక్సర్లను కొట్టాలనే కారణంతో బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకున్నానని చెప్పాడతను. దాదా బ్యాటింగ్ శైలిని అనుకరించాలనే ఏకైక కారణంతో కుడిచేతి వాటం నుంచి ఎడం చేతికి మారానని అన్నాడు. సౌరవ్ గంగూలీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, ఆయనలా క్రికెట్‌పై ఓ ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. తన బ్యాటింగ్‌పై సౌరవ్ ప్రభావం చాలా ఉందని చెప్పుకొచ్చాడు వెంకటేష్ అయ్యర్.

 స్టాండింగ్ ఒవేషన్..

స్టాండింగ్ ఒవేషన్..

అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది నైట్ రైడర్స్. శుభ్‌మన్ గిల్ త్వరగా అవుట్ అయినా.. మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠితో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వెంకటేష్ అయ్యర్- 30 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఓ స్లోయర్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను పెవిలియన్‌కు చేరుకుంటోన్న సమయంలో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. రాహుల్ త్రిపాఠి- 42 బంతుల్లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 74 పరుగులు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 24, 2021, 9:52 [IST]
Other articles published on Sep 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X