Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిన్నతనం నుంచే అలవాటు ఉంది: సిక్సర్లపై పాండ్యా

హైదరాబాద్: హార్ధిక్ పాండ్యా... ప్రస్తుతం భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న యువ ఆల్ రౌండర్. స్పిన్నర్లే లక్ష్యంగా చెలరేగి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో సత్తా చాటుతున్నాడు.

ఇప్పటివరకు ఆసీస్‌తో ముగిసిన మూడు వన్డేల్లో రెండు వన్డేల్లో జట్టుని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సైతం గెలుచుకున్నాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది మరో ఫినిషర్ అవతారం ఎత్తాడు.

I am capable of batting at any position: Hardik Pandya

అయితే సిక్సర్లను అంత సులువుగా కొట్టడంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పాండ్యా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'సిక్సర్లు బాదడం నాకు కొత్తేం కాదు. చిన్నతనం నుంచే అలవాటు ఉంది. నా బాల్యంలో క్రికెట్ ఆడేటప్పుడు ఎక్కువగా సిక్సర్లను కొట్టేవాణ్ని. నేను రాత్రికి రాత్రే సిక్సర్లు కొట్టే స్కిల్ ను నేర్చుకోలేదు' అని పాండ్యా అన్నాడు.

'క్రీజులోకి రావడంతోనే బాదడం మొదలుపెట్టను. మ్యాచ్‌ పరిస్థితిని అధ్యయనం చేశాకే దూకుడు ప్రారంభిస్తా. ఈ మ్యాచ్ లోనే కాదు. గత మ్యాచ్‌ల్లో కూడా సిక్సర్లను కొట్టా. భారీ ఎత్తులో సిక్సర్ల కొట్టడం నాకు అలవాటు. తొలి మ్యాచ్‌లో జంపా బౌలింగ్‌లో భారీ షాట్లు సాధ్యం అనిపించింది. వేచిచూసి అతడి ఏడో ఓవర్‌లో బాదేశా' అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌పై 76 పరుగుల ఇన్నింగ్సే తనకు టర్నింగ్‌ పాయింటా? అన్న ప్రశ్నకు కూడా సమాధానమిచ్చాడు. 'మీరలా అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు. గతంలో ఐపీఎల్‌లో నేను బాగా ఆడాను. చివరి సీజన్‌ అచ్చిరాలేదు. అందుకే కష్టపడి తిరిగి ఫామ్‌ అందుకున్నా' అని పాండ్యా తెలిపాడు.

ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం సవాల్‌గా కాకుండా అవకాశంగా భావించానని పాండ్యా తెలిపాడు. సంతోషంగా వచ్చేశానని, తొలిసారి ఎక్కువ బంతులు ఆడానని పాండ్యా ఈ సందర్భంగా తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+