డివిల్లీర్స్ అంటే నాకు తెగ ఇష్టం: విరాట్ కోహ్లీ
ముంబై: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఎబి డివిల్లీర్స్ పట్ల తనకు గల అభిమానాన్ని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాటుకున్నాడు. ఎబి డివిల్లీర్స్ పరిస్థితులకు తగినట్లుగా ఆడే ఆటగాడని ఆయన అన్నాడు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌలర్లను చితకబాదే డివిల్లీర్స్ దానికి స్వస్తి చెప్పి తమతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో ఆరు గంటలు వికెట్ల వద్ద నిలబడి 43 పరుగులు చేసిన విషయాన్ని కోహ్లీ గుర్తు చేశాడు. ఓటమిని తప్పించడానికి డివిల్లీర్స్ చేసిన కృషిగా దాన్ని ఆయన అభివర్ణించాడు.

గత కొన్నేళ్లుగా పెంచుకుంటున్న సమర్థతతో తాను డివిల్లీర్స్ అభిమానిగా మారినట్లు కోహ్లీ చెప్పాడు. గత మూడునాలుగేళ్లుగా డివిల్లీర్స్ సాధించింది అనూహ్యమని, శక్తిని ఉపయోగిస్తూ అన్ని ఫార్మాట్లలో సమర్థత చాటిన ఆటగాడికి డివిల్లీర్స్ క్లాసిక్ నిదర్శనంగా నిలుస్తాడని ఆయన అన్నాడు.
ఢిల్లీలో అతని ప్రదర్శనను చూసి అలా చేస్తాడని అనుకోలేదని చెప్పాడు. సిరీస్‌ను 2-0తో కోల్పోయిన తర్వాత మానసిక సామర్థ్యం దెబ్బ తింటుందని, కానీ డివిల్లీర్స్ 300కుపైగా బంతులను ఎదుర్కుని 40కి పైగా పరుగులు సాధించిన డివిల్లీర్స్ మానసిక సామర్థ్యం అద్భుతమని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications