
తాను పూర్తిగా సెహ్వాగ్ వెనక ఉన్నానని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే తాను మరో రాష్ట్రానికి మారడానికి వెనకాడబోనని అతను అన్నాడు. డిడిసిఎ కమిటీ సభ్యులు ఎంపిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ తాను ఢిల్లీ రంజీ జట్టు నుంచి తప్పుకుంటానని సెహ్వాగ్ సోమవారంనాడు హెచ్చరించాడు. ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా కూడా సెహ్వాగ్ కు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.