న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ పర్యటనకు నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నాం: కోహ్లీ

I Am 100 Percent Fit, Ready To Go: Virat Kohli Ahead Of UK Tour

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు తాను 110 శాతం సిద్ధంగానే ఉన్నానని కోహ్లీ తెలిపాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం తాను నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నానని కోహ్లి తెలిపాడు. విరామం తర్వాత నూతన ఉత్సాహంతో బరిలో దిగబోతున్నానని, అక్కడి ఎదురు కాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

'భారత క్రికెట్‌ను ఇంకొంత మెరుగుపరిచేందుకు ఇదే సరైన సమయం. ఇంతకుముందు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు నేను పూర్తి ఫిట్‌నెస్‌తో లేను. జట్టు పరంగా మేము ట్రెండ్ మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఇంగ్లాండ్ పర్యటనలో కచ్చితంగా గెలిచితీరుతాం. ఇది విహారయాత్ర కాదు. ఈ పర్యటనపై మేము చాలా సీరియస్‌గా ఉన్నాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

The central contracts of the Indian cricketers were finally cleared by the BCCI at the Special General Meeting (SGM) here today, ending a period of uncertainty ahead of their long tour of the UK.

భారత జట్టు శనివారం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడిన తర్వాత.. ఇంగ్లాండ్‌తో మూడేసి చొప్పున టీ20లు, వన్డేలు ఆడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత కౌంటీ క్రికెట్ ఆడేందుకు విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంది. కానీ గాయం కారణంగా సర్రే తరఫున ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు.

దీంతో కోహ్లి ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి. కానీ ఇంగ్లాండ్ పర్యటన కోసం నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నానని కోహ్లి తెలిపాడు. భారత జట్టు ఇంగ్లాండ్‌లో గత పర్యటనల్లో పెద్దగా రాణించలేదు. 2011లో 0-4 తేడాతో ఓడిన టీమిండియా, 2014లో 1-3 తేడాతో ఓటమిపాలైంది. ఈసారి ఎలాగైనా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గాలనే కసితో భారత జట్టు బరిలో దిగుతోంది.

Story first published: Friday, June 22, 2018, 16:49 [IST]
Other articles published on Jun 22, 2018
Read in English: I am 100% fit: Virat Kohli
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X