Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు లేను కానీ ఇప్పడు ఫిట్‌గానే ఉన్నాను: గంభీర్

Gautam Gambhir
హైదరాబాద్: ఇండియన్ ఓపెనర్, కొల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇటీవల ఇంగ్లాండ్ టూర్లో గాయపడిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ టి20కి మాత్రం తాను చాలా ఫిట్‌ ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ సోమర్ సెట్‌తో జరిగిన మ్యాచ్‌కి ముందు మీ ఫిట్ నెస్ ఎలా ఉందన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం. ఐతే ఈ మ్యాచ్‌ గౌతమ్ గంబీర్ అనూహ్యాంగా మొదటి బంతికే అవుటవ్వడం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కొల్ కత్తా నైట్ రైడర్స్‌పై సోమర్ సెట్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

దీనిని బట్టి మీకు ఏమి అర్దం అవుతుందంటే దేశం కోసం ఆడేటప్పుడూ గాయల పేరుతో జట్టుకు దూరమయ్యే ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్ అయిన ఐపిఎల్, ఛాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లకు మాత్రం పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నామని అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌తోపాటు జహీర్‌, సెహ్వాగ్‌, హర్భజన్‌, యువరాజ్‌, గంభీర్‌లు ఐపిఎల్‌, చాంపియన్స్‌ లీగ్‌ వంటి కాసుల క్రికెట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరి కొందరైతే ఈ టోర్నీల్లో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేందుకు దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు కూడా ఇష్టపడడం లేదు. అందుకు కారణం ఇలాంటి మ్యాచ్‌లకు ఆడడం వల్ల ఎక్కవ డబ్బుని సంపాదించుకొవచ్చనే నిర్ణయంతోనే వారు ఇలా చేస్తున్నారని గతంలో గంభీర్‌, యువరాజ్‌, ఇషాంత్‌, భజ్జీ తదితరులపై ఇటువంటి విమర్శలు వచ్చాయి. తాజాగా చాంపియన్స్‌ లీగ్‌లో గంభీర్‌ పాల్గొనడం అందరిని విస్మయానికి గురి చేసింది.

ఇంగ్లండ్‌ సిరీస్‌లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఫిట్‌నెస్‌తో లేనని మధ్యలోనే స్వదేశానికి చేరిన గంభీర్‌ ఇంత త్వరగా ఎలా కోలుకున్నాడో అర్థం కావడం లేదు. కాసుల క్రికెట్‌పై ఉన్న ఆసక్తి దేశానికి ప్రాతినిథ్యం వహించడంలో లేక పోవడం బాధించే విషయం. హర్భజన్‌ సింగ్‌ కూడా టీమిండియా కంటే చాంపియన్స్‌ లీగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఛాంపియన్స్ లీగ్ టి20 చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్దమవుతుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+