Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎమెస్కే: హార్దిక్ పాండ్యాను ఎందుకు ఎంపిక చేశామంటే..

ముంబై: ఇంగ్లాండుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ తన వాదనను వినిపించారు. ఇంగ్లాండుతో జరిగే ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచులకు బిసిసిఐ సెలెక్షన్ కమిటీ బుధవారం జట్టును ఎంపిక చేసింది.

ఇటీవలే న్యూజిలాండ్‌పై జరిగిన వన్డేల్లో ఎంట్రీ హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రశ్నించినప్పుడు 'కపిల్ దేవ్ తర్వాత అంతటి కచ్చితమైన ఆల్ రౌండర్ కోసం ప్రయత్నిస్తున్నామని అందుకే కొత్త వారికి అవకాశమిస్తున్నామని' సమాధానమిచ్చారు.

hardik pandya

ఇంగ్లాండుతో జరిగే టెస్ట్ సిరీస్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే పాండ్యా రెండో సీమర్‌గా వ్యవహరించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడని అన్నారు. ద్రావిడ్, కుంబ్లే శిక్షణలో పాండ్యా పరిణితి చెందాడని కూడా ప్రసాద్ అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్‌కు కూడా పాండ్యా ఎంపికయ్యాడు.

ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇండియా ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని ఎమెస్కె చేప్పారు. హార్దీక్ పాండ్యా ఆట తీరును పరిశీలిస్తే అతని పేస్ పెరిగిందని, వన్డే సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఎ తరఫున జరిపిన పర్యటనలోనూ బాగా ఆడాడని ఆయన చెప్పారు.

పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగలిగి నిలకడగా రాణించగలిగే ఆల్ రౌండర్ కోసం తాము అన్వేషిస్తున్నామని, ఇంతకు ముందు స్టువర్టు బిన్నీని పరీక్షించామని, అయితే బిన్నీ నిలకడగా రాణించలేకపోయాడని అన్నారు.

తాము కపిల్ దేవ్ వంటి ఆల్ రౌండర్‌ కోసం గాలిస్తున్నామని, ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పుడు రెండో పేసర్ బ్యాటింగ్ కూడా చేయగలిగి ఉండాలని ఆయన హార్దీక్ పాండ్యాను ఎంపిక చేయడంపై చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+