Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహానగరం హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు - పోలీసులు లాఠీ ఛార్జ్!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అలానే హైదరాబాద్ మహానగరంలో యువత రోడ్ల మీదికి చేరుకుని ఆనందంతో సెలబ్రేషన్స్ చేరుకున్నారు. డ్యాన్స్ లు చేస్తూ, ర్యాలీలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యంగా దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని పలు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, యువకులు, ప్రధాన రహదారి మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకుని జయహో టీమిండియా అంటూ నినాదాలు చేశారు. చైతన్యపురిలోనూ ర్యాలీ నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసుల వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు.

Hyderabad youth grand celebrations after India won Champions Trophy 2025

ఇంకా ట్యాంక్‌ బండ్‌ మీదకు కూడా అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఐటీ కారిడార్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ సరదాగా గడిపారు. బైక్ ర్యాలీలు, కేక్ కటింగ్ లు చేసి.. భారత్ క్రికెట్ విజయంపై తమ అభిమానం చాటుకున్నారు.

కాగా, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 252 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకుంది. రోహిత్‌ శర్మ (83 బంతుల్లో 76; 7×4, 3×6) కీలక ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కించుకున్నాడు. కివీస్ ప్లేయర్ రచిన్‌ రవీంద్ర 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డును గెలుచుకున్నాడు.

Story first published: Monday, March 10, 2025, 8:13 [IST]
Other articles published on Mar 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+