ఓపెనర్ల అర్ధశకాలు.. కోల్‌కతాపై సన్‌రైజర్స్ విజయం

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తాజా విజయంతో సన్‌రైజర్స్ పాయింట్లను 10కి పెంచుకుని.. ప్లే ఆఫ్ రేసులో పోటీకి నిలిచింది. పంజాబ్, సన్‌రైజర్స్ 10 పాయింట్లతో సమానంగా ఉన్నా.. సన్‌రైజర్స్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఓపెనర్ల జోరు:
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మినహా.. 9వ ఓవర్ వరకు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలు పోటీపడి బౌండరీలు, సిక్సులు బాదారు. ఈ జోడి విరుచుకుపడడంతో ఇన్నింగ్స్ రన్ రేట్ 10కి తగ్గకుండా వచ్చింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ (52, 30 బంతుల్లో 2x4, 4x6), బెయిర్‌స్టో (52, 30 బంతుల్లో 6x4, 2x6) అర్ధ శతకాలు సాధించారు.

వార్నర్ అవుట్.. బెయిర్‌స్టో మెరుపులు:
అయితే ధాటిగా ఆడే క్రమంలో వార్నర్ పెవిలియన్ చేరాడు. యర్రా పృథ్వీరాజ్ వేసిన 13వ ఓవర్‌లో వార్నర్ (67, 38 బంతుల్లో 3x4, 5x6) బౌల్డయ్యాడు. అనంతరం బెయిర్‌స్టోకు కెప్టెన్ విలియంసన్ (8) చక్కటి సహకారం అందించాడు. అర్ధ సెంచరీ అనంతరం బెయిర్‌స్టో మాత్రం మెరుపులు మెరిపించాడు. ఇక 15వ ఓవర్‌లో బెయిర్‌స్టో (80, 43 బంతుల్లో 7x4, 4x6) రెండు సిక్సులు, ఓ ఫోర్ బాది సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించాడు. కోల్‌కతా బౌలర్ పృథ్వీరాజ్ ఒక వికెట్ తీసాడు.

కోల్‌కతా బ్యాట్స్‌మెన్ విఫలం:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్‌లిన్ (51) అర్ధ శతకం చేసాడు. సునిల్ నరైన్ (25), రింకు సింగ్ (30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా రాణించలేదు. చివరలో రసెల్ కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో కోల్‌కతా సాధారణ పరుగులకే పరిమితమయింది. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications