For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో ఏకైక టెస్టు, డే1: సెంచరీలు కొట్టిన కోహ్లీ, విజయ్

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజులో కోహ్లీ 111, రహానే 45 పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కేఎల్ రాహుల్ రూపంలో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.

ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పుజారా 83 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరగా, ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ కోహ్లీ సెంచరీలు సాధించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో పుజారాకి ఇది 9వ టెస్టు సెంచరీ కాగా, కోహ్లీకి ఇది 16వ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లా బౌలర్లలో అహ్మద్, మిరాజ్, ఇస్లాం తలో వికెట్ తీసుకున్నారు.


తొలిరోజు ఆట సాగిందిలా:

16వ సెంచరీ సాధించిన కోహ్లీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. 130 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 10 ఫోర్లతో 100 పరుగులు సాధించాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 16వ సెంచరీ. దీంతో 87 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 101, రహానే 35 పరుగులతో ఉన్నారు.

అర్ధసెంచరీ సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ చేశాడు. 70 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో కోహ్లీ తన కెరీర్‌లో 15వ అర్ధసెంచరీని నమోదు చేశాడు. దీంతో 75 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 269 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 58, రహానే 11 పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ అనంతరం 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ మురళీ విజయ్ బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో విజయ్ క్లీన్ బౌల్డయ్యాడు. మురళీ విజయ్ అవుటైన తర్వాత రహానే క్రీజులోకి వచ్చాడు. దీంతో 66 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 36, రహానే 2 పరుగులతో ఉన్నారు.

సెంచరీతో కదం తొక్కిన మురళీ విజయ్
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో పుజారాకిది 9వ సెంచరీ కావడం విశేషం. 149 బంతులను ఎదుర్కొన్న విజయ్ 11 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 101 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. అంతక ముందు రెండో వికెట్‌గా వెనుదిరిగిన పుజారా అర్ధ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్‌కు పుజారాతో కలిసి విజయ్ 178 పరుగులు జోడించాడు.

టీ విరామానికి టీమిండియా 206/2
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీ విరామ సమయానికి 58 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, మురళీ విజయ్‌కు సహకరిస్తూ స్కోరు బోర్డుని పరుగెత్తిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 98, కోహ్లీ 17 పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దీంతో నిలకడగా ఆడుతున్న పుజారా-మురళీ విజయ్‌ల జోడీకి అడ్డుపడింది. జట్టు స్కోరు 180 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 83 పరుగులు చేసిన పుజారా హసన్ బౌలింగ్‌లో రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పుజారా అవుటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. 56 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 97, కోహ్లీ 14 పరుగులతో ఉన్నారు.

అర్ధసెంచరీతో చెలరేగిన పుజారా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో పుజారా అర్ధసెంచరీని నమోదు చేశాడు. 108 బంతులను ఎదుర్కొన్న పుజారా 5 ఫోర్ల సాయంతో అర్దసెంచరీ సాధించాడు. దీంతో 34 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. పుజారాకు ఇది టెస్టుల్లో 11వ అర్ధసెంచరీ. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అర్ధసెంచరీ నమోదు చేసిన మురళీ విజయ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో మురళీ విజయ్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. 84 బంతులను ఎదుర్కొన్న మురళీ విజయ్ 7 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. మురళీ విజయ్‌కిది 15వ టెస్టు అర్ధసెంచరీ కాడవం విశేషం. 33 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 49, మురళీ విజయ్ 56 పరుగులతో ఉన్నారు.

లంచ్ విరామానికి టీమిండియా 86/1
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో లంచ్ విరామ సమయానికి 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 45, పుజారా 39 పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్ అహ్మద్‌కు ఒక వికెట్ లభించింది.

20 ఓవర్లకు టీమిండియా 70/1
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌ నెమ్మదిగా ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్‌ల్లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(2) ఇన్నింగ్‌ నాలుగో బంతికే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బరిలోకి దిగిన పుజారాతో కలిసి విజయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ప్రస్తుతం భారత్ 20 ఓవర్లు ముగిసే సరికి 70 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 31, విజయ్ 36 పరుగులతో ఉన్నారు.

డ్రింక్స్ బ్రేక్: భారత్ 40/1

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో డ్రింక్స్ విరామ సమయానికి 12 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి టీమిండియా 40 పరుగులు చేసింది. ప్రస్తుతం ఛటేశ్వర్ పుజారా 16, మురళీ విజయ్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కేఎల్ రాహుల్ అవుట్
బంగ్లాదేశ్‌తో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(2) తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. తొలి ఓవర్‌ను వేసిన తస్కిన్, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తన అద్భుత బంతితో పెవీలియన్‌కు పంపాడు. ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వెళుతున్న బంతిని రాహుల్ ఆడగా, అది ప్యాడ్లను తాకుతూ వికెట్లపైకి వచ్చింది. దీంతో రెండు పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం పుజారా, మురళీ విజయ్ క్రీజులో ఉన్నారు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఉప్ప‌ల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంద‌ని టాస్ గెలిచిన త‌ర్వాత టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ ముషిఫిక‌ర్ ఇదో అద్భుత సంద‌ర్భ‌మ‌న్నాడు.

Hyderabad Test: India win toss, elect to bat against Bangladesh

ఒక‌వేళ టాస్ గెలిచి ఉంటే, తాము కూడా ముందే బ్యాటింగ్ తీసుకునేవాళ్ల‌మని చెప్పాడు. భారత్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడేందుకు బంగ్లాదేశ్ వచ్చింది. తుది జట్టులో ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్‌కు చోటు లభించలేదు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో కరుణ్ నాయర్ స్థానంలో అజ్యింకే రహానేను తీసుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న టీమిండియా, 9వ స్ధానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో ఆడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

జట్ల వివరాలు:

భారత్:

బంగ్లాదేశ్:

అరుదైన రికార్డుకి చేరువలో కోహ్లీ:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధిస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడు.
27 టెస్టు విజయాలతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొట్టమొదటి స్ధానంలో నిలవగా, 21 టెస్టు విజయాలతో సౌరభ్ గంగూలీ రెండో స్ధానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత 14 టెస్టు విజయాలతో అజహరుద్దీన్, కోహ్లీలు సమంగా ఉన్నారు.

250 వికెట్లకు 2 వికెట్ల దూరంలో అశ్విన్:

టీమిండియా టాప్ స్పిన్నర్, టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకి అడుగు దూరంలో నిలిచాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లను తీసుకున్న ఆస్ట్రేలియా బౌలింగ్ లెజెండ్ డెన్నిస్ లిల్లీ రికార్డుని అశ్విన్ ఈ టెస్టులో అధిగమించే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 44 టెస్టులాడిన అశ్విన్ 248 వికెట్లను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈ అరుదైన రికార్డుని కేవలం 2 వికెట్ల దూరంలో నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+