Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్‌కు శుభవార్త: హైదరాబాద్ టెస్టు టిక్కెట్టు డబ్బులు వాపస్

 Hyderabad Test: India Vs West Indies: hca to be refund day 4 and 5 tickets money

హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుకు నగరంలోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేయడంతో వెస్టిండిస్ జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్

మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్

మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో చివరి రెండు రోజులు టిక్కెట్టు కొనుక్కున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ రెండు రోజుల(ఆక్టోబర్ 15, 16) కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) టికెట్‌ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్‌సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు

జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు

నవంబర్ 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు హెచ్‌సీఏ తన ప్రకటనలో పేర్కొంది. నాలుగో, ఐదో రోజు మ్యాచ్‌ టికెట్లు కొన్న వారు ఒరిజినల్‌ టికెట్లతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలతో కౌంటర్‌ వద్ద సంప్రదించాలని వెల్లడించింది.

ఆన్‌లైన్‌ ద్వారా కొన్న వారికి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపు

ఆన్‌లైన్‌ ద్వారా కొన్న వారికి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపు

ఇక, ఆన్‌లైన్‌ ద్వారా కొన్న వారికి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపు చేయనున్నట్లు హెచ్‌సీఏ తెలిపింది. అయితే, మొత్తం మ్యాచ్‌ వీక్షించేందుకు సీజన్‌ టికెట్‌ తీసుకున్న వారికి ఎలాంటి వాపసు ఉండదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. కాగా, ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులకు ఆలౌటైంది.

10 వికెట్ల తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన

10 వికెట్ల తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన

అనతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, విండీస్ బ్యాట్స్‌మన్ పేలవ ప్రదర్శనతో రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌటైంది. దీంతో 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో రెండు రోజులు మిగిలుండగానే విజయం సాధించింది.

Story first published: Thursday, November 8, 2018, 12:06 [IST]
Other articles published on Nov 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+