హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీంతో కోహ్లీ కెప్టెన్సీలో సొంతగడ్డపై టీమిండియాకు ఇది నాలుగో సిరిస్ విజయం కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన భారత తొలి కెప్టెన్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అజహరుద్దీన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ ఖాతాలో ఇది 15వ విజయం కాగా దీంతో అత్యధిక విజయాలు సాధించిన 3వ కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో నాలుగు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీసుకున్నాడు.
స్కోర్లు:
భారత్-687/7 & 159/4 డిక్లేర్డ్;
బంగ్లాదేశ్- 388 & 250
ఐదో రోజు ఆటు తీరు సాగిందిలా:
తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 24 బంతులను ఎదుర్కొన్న తైజుల్ ఇస్లాం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 97 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 9 వికెట్లను కోల్పోయి 250 పరుగులు చేసింది. 70 బంతులను ఎదుర్కొన్న కమ్రుల్ ఇస్లాం 3 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసేందుక తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇతనికి తోడు టస్కిస్ అహ్మద్ 1 పరుగుతో క్రీజులో ఉన్నాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 97 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తైజుల్ ఇస్లాం 5, కమ్రుల్ ఇస్లాం 3 పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 211 పరుగులు చేయాల్సి ఉంది.
ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చేరువైంది. 459 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆఖరి రోజైన సోమవారం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టుస్కోరు 225 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. బంగ్లా ఆటగాడు మొహ్ముదుల్లా(64) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లాదేశ్ 78 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మెహిదీ హాసన్ 9, ఇస్లాం 0 పరుగులతో ఉన్నారు.

ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లా
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 202 పరుగులతో లంచ్ విరామ అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇషాంత్ బౌలింగ్‌లో షబ్బీర్ రహమాన్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో 75 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 224 పరుగులకు చేసింది.
ఓటమి దిశగా బంగ్లా: లంచ్ విరామానికి 202/5
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా పయనిస్తోంది. చివరి రోజైన సోమవారం 459 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయి, లంచ్ విరామ సమయానికి 5 వికెట్లకు 202 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన షకీబ్ ఉల్ హాసన్ (22), ముష్ఫికర్ రహీమ్‌లు (23) స్వప్ప పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో బంగ్లా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా (58 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి తోడు క్రీజులో షబ్బీర్ (18 నాటౌట్) పరుగులతో ఉన్నారు.

ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు ఇప్పటికే 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బంగ్లాదేశ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 257 పరుగులు చేయాల్సి ఉంది. 58 ఓవర్ల ఆట మిగిలి ఉంది. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా, జడేజా 2 వికెట్లు తీసుకున్నాడు.
బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
103/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదోరోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 162 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 54 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.