హైదరాబాద్ టెస్ట్: వెస్టిండిస్ 127 ఆలౌట్, భారత్ లక్ష్యం 72

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 72 పరుగుల విజయ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆటలో భాగంగా ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే పేసర్ ఉమేశ్ యాదవ్ విండీస్‌కు ఊహించని షాకిచ్చాడు. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం మరో ఓపెనర్ కీరన్ పావెల్‌ను ఔట్ చేసిన స్పిన్నర్ అశ్విన్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. దీంతో కేవలం 9 పరుగులకే పర్యాటక జట్టు రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది.

రెండో ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ విఫలం
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్, హెట్‌మైర్‌లు ఆచితూచి ఆడేప్రయత్నం చేశారు. అయితే, ఆ తర్వాత రెండు వరుస ఓవర్లలో షెయ్ హోప్(28), హెట్‌మెయిర్(17) వికెట్లు పడగొట్టిన టీమిండియా మ్యాచ్‌లో పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోస్టన్ ఛేజ్(6) కూడా వెనుదిరగడం... అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు.

ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం
వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. వెస్టిండిస్ బ్యాట్స్‌మన్లలో సునీల్ అంబ‍్రిస్(38) టాస్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దీంతో ఓ టెస్టులో తొలిసారి 10 వికెట్లను తీసుకున్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్‌కి తోడు రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. కుల్డీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా, అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 308/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 59 పరుగులు మాత్రమే జోడించింది.

ఐదో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం
మూడోరోజైన ఆదివారం ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్ నైట్ ఆటగాడు రహానే(80) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు.

రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీని మిస్ చేసుకున్న రిషబ్ పంత్
ఇక, రెండో రోజు ఆటలో అద్భుత ఆటతీరు కనబరిచిన రిషబ్ పంత్ తృటిలో మూడో రోజు తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన పంత్.. అనవసర షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ఆఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 367 ఆలౌట్
అనంతరం క్రీజులోకి వచ్చిన కుల్దీప్(6), ఉమేశ్‌లు(2) కూడా వెంట వెంటనే ఔటయ్యారు. అయితే రవిచంద్రన్ అశ్విన్(35) స్కోర్ పెంచేందుకు ప్రయత్నించగా.. గాబ్రియేల్ బౌలింగ్‌లో పదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 367 పరుగుల దగ్గర టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వెస్టిండీస్ బౌలర్లలో ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ ఐదు వికెట్లు తీయగా.. గాబ్రియేల్ మూడు వికెట్లు తీసుకోగా, వారికమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications