హైదరాబాద్ టెస్ట్: వెస్టిండిస్ బ్యాటింగ్, టెస్టుల్లో శార్ధుల్ ఠాకుర్ అరంగేట్రం


హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో భారత యువ బౌలర్ శార్దుల్ ఠాకుర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ రాజ్‌కోట్ ఆటనే పునరావృతం చేస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మహ్మద్ షమీ స్థానంలో శార్ధుల్ ఠాకుర్ అరంగ్రేటం చేస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు వెస్టిండీస్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి టెస్ట్ కి దూరమైన కెప్టెన్ హోల్డర్ మళ్లీ టీం లోకి వచ్చాడు.
కీమర్ రోచ్, షెమాన్ లూయిస్ స్థానాల్లో జట్టులోకి కీమోపాల్, జోమెల్ వారికాన్‌లకు చోటు కల్పించారు. తొలి టెస్టులో దారుణంగా ఓడిన వెస్టిండిస్ జట్టు ఈ టెస్టులో ఎలాగైన నెగ్గి పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం తమ జైత్రయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
తుది జట్లు:
టీమిండియా: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా, ఉమేశ్, కుల్దీప్, శార్ధుల్.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షై హోప్, ఆంబ్రిస్, హెట్‌మెయర్, ఛేజ్, డౌరిచ్, బిషూ, వారికన్, గాబ్రియెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications