Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టును ప్రకటించిన హైదరాబాద్

దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో బరిలోకి దిగే హైదరాబాద్ జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మంగళవారం ప్రకటించింది. తిలక్ వర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును హెచీసీఏ వెల్లడించింది. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టు‌ను ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్‌గా రాహుల్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్ జట్టు తొలి రౌండ్ షెడ్యూల్‌లో గుజరాత్, ఉత్తరాఖండ్‌లతో తలపడనుంది. అక్టోబర్ 11 నుంచి గుజరాత్‌తో, 18వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌తో పోటీపడనుంది. తర్వాతి రౌండ్ల షెడ్యూల్‌లో వరుసగా పుదుచ్చేరి, రాజస్థాన్, ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్, విదర్భ జట్లలతో హైదరాబాద్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Hyderabad Team Announced for Ranji Trophy Tilak Varma Named Captain

ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టు.. అదే జోరును రంజీ ట్రోఫీలోనూ ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. ఫైనల్‌లో ఛత్తీస్‌ఘడ్‌పై హైదరాబాద్ 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు జార్ఖండ్, మధ్యప్రదేశ్‌, తమిళనాడు జట్లను కూడా ఓడించింది. ఈ టోర్నీలో బలమైన జట్టు ముంబైతో సహా 12 జట్లు పాల్గొన్నాయి.

హైదరాబాద్‌ రంజీ జట్టు: తిలక్‌ వర్మ(కెప్టెన్‌ ), రాహుల్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), సీవీ మిలింద్, తన్మయ్‌ అగర్వాల్, రోహిత్‌ రాయుడు, తనయ్‌ త్యాగరాజన్, అనికేత్‌ రెడ్డి, కన్నాల నితేశ్, అభిరత్‌ రెడ్డి, హిమతేజ, రాహుల్‌ రాధేశ్, రక్షణ్‌ రెడ్డి, కార్తికేయ కక్, శరణు నిశాంత్, ధీరజ్‌ గౌడ్‌.
స్టాండ్‌ బైస్‌: బుద్ధి రాహుల్, వరుణ్‌ గౌడ్, రిషబ్‌ బస్లాస్, భగత్‌ వర్మ, అజయ్‌దేవ్‌ గౌడ్‌.

Story first published: Wednesday, October 2, 2024, 13:22 [IST]
Other articles published on Oct 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+