ముంబై ఇండియన్స్‌కు తెలంగాణ ఫ్లేవర్: రోహిత్ సేనలో చేరిన హైదరాబాదీ కుర్ర క్రికెటర్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఈ ఈవెంట్ పునఃప్రారంభమైంది. ఈ సెషన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల హవా నడుస్తోంది. బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయల నుంచి కోటికి పైగా రేటుకు అమ్ముడుపోతున్నారు జూనియర్స్. యష్ ధుల్, రిపుల్ పటేల్, లలిత్ యాదవ్, రాజ్ అంగద్ బావా భారీ రేటు పలికారు.
హైదరాబాదీ కుర్ర క్రికెటర్
యష్ ధుల్, రిపుల్ పటేల్ లలిత్ యాదవ్‌ను ఢిల్లీ కేపిటల్స్ ఎగరేసుకెళ్లింది. రాజ్ అంగద్ బావాను రెండు కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ టేకోవర్ చేసింది. అదే సమయంలో- హైదరాబాదీ కుర్ర క్రికెటర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కోటి 70 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ప్రిస్టేజియస్ అండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ స్క్వాడ్‌లో చేరాడీ ప్లేయర్. భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అదృష్టాన్ని దక్కించుకున్నాడు.
తిలక్ వర్మకు బంపర్ ఆఫర్..
ఇప్పటికే అండర్-19 జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ క్రికెటర్. అతనే ఎన్ తిలక్ వర్మ. పూర్తి పేరు నంబూరి తిలక్ వర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఎడమచేతి వాటం బ్యాటర్. కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్. ప్రస్తుతం టీమిండియా అండర్-19లో బ్యాటింగ్ బ్యాక్‌బోన్‌గా గుర్తింపు పొందాడు. 2018-19 సీజన్‌లో రంజీట్రోఫీ సందర్భంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడాడు.
కేఎస్ భరత్ ఢిల్లీకి..
లిస్ట్-ఏలో ఇప్పటిదాకా 16 మ్యాచ్‌లు ఆడాడు. 784 పరుగులు చేశాడు. అతని హయ్యెస్ట్ స్కోర్ 156. బ్యాటింగ్ యావరేజ్ 52.26. లిస్ట్-ఏ, దేశవాళీ టీ20 మ్యాచ్‌లల్లో భారీ స్కోర్లతో అదరగొట్టాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ కంట్లో పడ్డాడు. కోటి 70 లక్షలకు తిలక్ వర్మను కొనుగోలు చేసింది. ఈ మెగా వేలంపాట సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎంపికైన మరో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ. ఇదివరకు బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కేఎస్ భరత్.. ఢిల్లీ కేపిటల్స్‌కు ఎంపికయ్యాడు.
సిరాజ్ తరువాత..
హైదరాబాద్‌కే చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నసిరాజ్.. టీమిండియా తరఫున అన్ని ఫార్మట్లలోనూ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడుతున్నాడు. టెస్ట్, టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌లో సత్తా చాటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతణ్ని రిటైన్ చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications