అర్ధరాత్రి వరకు మెట్రో: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభవార్త

Posted By:
Hyderabad Metro to run midnight service for IPL matches

హైదరాబాద్: క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ అభిమానులకు ఓ తీపి కబురందించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడే అన్ని మ్యాచ్‌లకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలసిందే.

దీంతో ఉప్పల్ స్టేడియం మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లను అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు శనివారం ప్రకటించారు. ఏప్రిల్‌తో పాటు మే నెలలో కూడా ఈ పొడిగింపు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో రైళ్లను రాత్రి 10.00 గంటల వరకే నడుపుతున్నారు.

గతంలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో మెట్రో అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఐపీఎల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఐపీఎల్ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఈ పొడిగింపుకు సంబంధించి సీబీటీసీ అనుమతి కోరగా, వారి నుంచి క్లియరెన్స్ వచ్చిందని ఆయన అన్నారు. అమీర్‌పేట-నాగోల్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు... అమీర్‌పేట-మియాపూర్ మార్గంలో ప్రతి 8 నిమిషాలకు మెట్రో రైలుని నడిపేందుకు మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 14:11 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి