ఫైనల్‌కు చేరిన హైదరాబాద్!
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. పీఎస్ఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు అసాధారణంగా పోరాడి ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ ఆరంభంలో వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న హైదరాబాద్ కింగ్స్‌మెన్.. అనంతరం పుంజుకుని ప్లేఆఫ్స్‌కు చేరింది.ఎలిమినేటర్-1లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్.. రెండో ఎలిమినేటర్ పోరులో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై ఉత్కంఠ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది.
చివరి ఓవర్లో హైడ్రామా
లాహోర్ వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ క్రికెట్ ప్రేమికులకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది. ఇస్లామాబాద్ విజయానికి చివరి 6 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే అవసరమైన తరుణంలో 22 ఏళ్ల యువ పేసర్ హునైన్ షా బంతిని అందుకున్నాడు. క్రీజులో ఫహీమ్ అష్రఫ్, క్రిస్ గ్రీన్ వంటి ప్రమాదకర బ్యాటర్లు ఉన్నప్పటికీ.. హునైన్ అద్భుతమైన నియంత్రణను ప్రదర్శించాడు. మొదటి మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి నాలుగో బంతికి అష్రఫ్‌ను ఔట్ చేశాడు. చివరి బంతికి 4 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ గ్రీన్ కేవలం ఒక లెగ్ బై మాత్రమే తీయగలిగారు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఉస్మాన్ ఖాన్ విధ్వంసం
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ కేవలం 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా కుశాల్ పెరీరా (37), కెప్టెన్ లబుషేన్ (39), సైమ్ అయూబ్ (38) రాణించారు. ముఖ్యంగా ఉస్మాన్ ఖాన్, పెరీరా జంట ఐదో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఇస్లామాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
పోరాడి ఓడిన ఇస్లామాబాద్
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఆరంభంలో తడబడింది. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో డెవాన్ కాన్వే, షాదాబ్ ఖాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో మార్క్ చాప్‌మన్ (43), హైదర్ అలీ (31) మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 19వ ఓవర్లో 22 పరుగులు రావడంతో ఇస్లామాబాద్ గెలుపు ఖాయమనిపించింది, కానీ హునైన్ షా అద్భుత బౌలింగ్ వల్ల ఇస్లామాబాద్ 184 పరుగులకే పరిమితమైంది. ఇప్పుడు మే 4న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్, పెషావర్ జల్మీతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications