టీ20 వరల్డ్ కప్ విజేత మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ముంబైలో విక్టరీ పరేడ్‌ను ముగించుకున్న సిరాజ్ శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాడు. శంషాబాద్ విమానశ్రయంలో అడుగుపెట్టిన సిరాజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది. అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.
విమానశ్రయంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్ గెలిచినందకు సంతోషంగా ఉందని అన్నారు. ఛాంపియన్‌గా నిలిచిన అనుభూతి వర్ణించడానికి మాటలు రావట్లేదని తెలిపాడు. ఇది హైదరాబాద్‌కు గర్వించదగ్గ క్షణాలు అని అన్నాడు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి భారత జట్టుకు మరిన్ని టైటిళ్లు సాధించేలా కృషి చేస్తానని సిరాజ్ పేర్కొన్నాడు.

అనంతరం మహ్మద్ సిరాజ్ రోడ్ షోలో పాల్గొన్నాడు. మెహదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు పాల్గొన్న రోడ్ షోలో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. సిరాజ్‌కు అభినందనలు తెలపడానికి టీమిండియా అభిమానులు భారీగా తరలివచ్చారు. సిరాజ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంలో సిరాజ్ తన వంతు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుదిజట్టులో అవకాశం వచ్చినప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ప్రధాన బ్యాటర్లు కూడా తడబడిన ఆ మ్యాచ్‌లో సిరాజ్ అజేయంగా ఏడు పరుగులు సాధించాడు. ఇవి విజయం ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ టోర్నీలో ఫీల్డింగ్‌లోనూ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు.