Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ వెంకటపతి రాజు రాజీనామా

Venkatapathi Raju
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ వెంకటపతిరాజు తన పదవికి రాజీనామా చేశారు. రంజీ ట్రోఫీలో రాజస్థాన్ పై హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పరాజయానికి నైతికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. వివేక్ జయసింహ, కన్వల్జిత్ సింగ్ లు కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీరి రాజీనామాల విషయం బయటకు పొక్కకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ) పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. హెచ్ సిఎ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ కు వారు బుధవారం రాత్రే రాజీనామా లేఖలు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఆ విషయం తమకు తెలియదని హెచ్ సిఎ కార్యదర్శి చలపతి అంటున్నారు.

వెంకటపతి రాజుతో పాటు ఇతర కోచ్ లు కూడా జట్టుకు శిక్షణ ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నెలకు 12 లక్షల రూపాయల వేతనం తీసుకుంటున్న వెంకటపతిరాజు తీరు మరింత అధ్వాన్నంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. రంజీ ఆటగాళ్లకు ఎలా ఆడాలో కొత్తగా చెప్పాలా, కోచ్ ఎన్ని మాటలు చెప్పినా మైదానంలో ఆడేది ఆటగాళ్లే, వాళ్లు ఆడకపోతే కోచ్ తప్పెలా అవుతుందని ఆయన పలు మార్లు అన్నారు. వెంకటపతి రాజు వ్యవహార శైలిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+