Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీవీ ఆనంద్ కుమారుడు ఐపీఎల్‌ 2022లో ఎంట్రీ: ఆ టీమ్‌లో..: తండ్రికి తగ్గ తనయుడిగా

Hyderabad Police Commissioner CV Anands Son Chama Milind Anand sold to RCB.

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. సెకెండ్ ఆఫ్ సెషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ సెలెక్షన్లతో హాట్ టాపిక్‌గా మారింది. లంచ్ బ్రేక్ తరువాత తొలిసారిగా తన బిడ్డింగ్‌ను ప్రారంభించింది. ఆటగాళ్లను తీసుకోవడం మొదలు పెట్టింది. మహిపాల్ లొమ్రార్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 95 లక్షల రూపాయలతో మహిపాల్‌ను జట్టులోకి తీసుకుంది.

 సెకెండ్ సెషన్‌లో జోరు..

సెకెండ్ సెషన్‌లో జోరు..

రాయల్ ఛాలెంజర్స్ రెండో రోజు వేలం పాట సందర్భంగా జట్టులోకి తీసుకున్న తొలి ప్లేయర్ అతనే. అన్‌క్యాప్డ్ బౌలర్ల కేటగిరీలో వరుసగా ప్లేయర్లను తీసుకుంది. యష్ దయాళ్‌, ఫిన్ అలెన్‌ను తీసుకుంది. అనంతరం కోటి రూపాయలతో షెర్ఫానె రూథర్‌ఫర్డ్‌ను కొనుగోలు చేసింది. ఆ తరువాత 75 లక్షలకు జేసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను హైర్ చేసింది. అదే దూకుడును కొనసాగించింది. ప్రవీణ్ దుబె, సుయాష్‌, చామా మిలింద్‌ ఆనంద్‌ను తీసుకుంది. ప్రవీణ్ దుబే-రూ.30 లక్షలు, సుయాష్-20, చామా మిలింద్‌ ఆనంద్-25 లక్షలకు కొనుగోలు చేసింది.

 యంగ్ ప్లేయర్ల బ్యాకప్..

యంగ్ ప్లేయర్ల బ్యాకప్..

యంగ్ ప్లేయర్లతో అద్భుతమైన బ్యాకప్‌ను సెట్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ. ఈ సెషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్న ప్లేయర్లందరూ బౌలర్లే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేలంపాట ప్రారంభమైన తొలి రోజు కూడా బౌలర్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది బెంగళూరు ఫ్రాంఛైజీ. వనిందు హసరంగ, హర్షల్ పటేల్‌‌ను తీసుకుంది. దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, అనూజ్ రావత్, జోష్ హేజిల్‌వుడ్, అక్ష్‌దీప్‌ను తొలి రోజే హైర్ చేసుకుంది.

25 లక్షలతో ఆర్సీబీకి..

25 లక్షలతో ఆర్సీబీకి..

25 లక్షల రూపాయలతో జట్టులోకి తీసుకున్న చామా మిలింద్ ఆనంద్ మరెవరో కాదు.. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు. దేశవాళీ క్రికెట్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ క్రికెటర్‌గా ఇదివరకే మంచి గుర్తింపు పొందాడు మిలింద్. ప్రధానంగా బౌలర్. బౌలింగ్ చేయడం అతని ప్రధానాస్త్రం. ఎడమ చేతి వాటం బౌలర్.. బ్యాటర్. బౌలింగ్ ఈ కేటగిరీలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. చామా మిలింద్‌ను తీసుకుంది.

బౌలర్‌గా నిలకడ..

లిస్టింగ్-ఏలో 45 మ్యాచ్‌లను ఆడాడు. 82 వికెట్లను పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 6/43. బౌలింగ్ ఎకానమి 5.34. డొమెస్టిక్‌లో 53 టీ20 మ్యాచ్‌లల్లో ఆడాడు మిలింద్. 83 వికెట్లు తీసుకున్నాడు. ఎనిమిది పరుగులిచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు. టీ20ల్లో ఇది బెస్ట్ బౌలింగ్ ఫిగర్. బౌలింగ్ ఎకానమి 7.62. 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లల్లో 85 వికెట్లు తీసుకున్నాడు. ఇలా ఈ ఫార్మట్ అన్నింట్లోనూ 80కి పైగా వికెట్లను పడగొట్టడం మిలింద్ కన్సిస్టెన్సీకి నిదర్శనం.

IPL Auction 2022 : Lucky Players In IPL 2022, Lakhs Turns To Crores | Oneindia Telugu
తండ్రికి తగ్గ కుమారుడు..

తండ్రికి తగ్గ కుమారుడు..

సీవీ ఆనంద్ కూడా క్రికెటరే. ఇంటర్ యూనివర్శటీ టోర్నమెంట్లల్లో ఆడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఆయన అండర్-19లో ఆడారు. ఇంగ్లాండ్‌లో పర్యటించారు. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు కూడా క్రికెటర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక మోస్ట్ ప్రిస్టేజియస్ మెగా టోర్నమెంట్ ఐపీఎల్‌కు సెలెక్ట్ కావడం- మిలింద్ క్రికెట్ కేరీర్‌ను మరో మలుపు తిప్పినట్టే.

Story first published: Sunday, February 13, 2022, 19:01 [IST]
Other articles published on Feb 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+