Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కార్డిఫ్ పురుషుల జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్

Hundred league: Gary Kirsten appointed head coach of men’s Cardiff team

లండన్: 100 బంతుల టోర్నమెంట్ 'ది హండ్రెడ్' కోసం కార్డిఫ్ పురుషుల జట్టు కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్, భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నియమితులయ్యారు. అలాగే గత ఏడాది ఆస్ట్రేలియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడానికి ప్రధాన కారకుడైన మాథ్యూ మోట్ కార్డిఫ్‌లో మహిళల జట్టుకు భాద్యతలు చేపట్టనున్నారు. కిర్‌స్టన్, మోట్ ఇద్దరూ పలు జట్లకు కోచ్‌గా రాణించిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ కిర్‌స్టన్ 2011లో టీమిండియా సొంత గడ్డపై ప్రపంచకప్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాను టెస్టుల్లో మొదటి ర్యాంకుకు కూడా చేర్చాడు. బిగ్ బాష్‌లో హోబర్ట్ హరికేన్స్‌, ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కూడా కిర్‌స్టన్ పనిచేశాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌కు దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కలేదు.

'ఇంగ్లీష్ మరియు వేల్స్ బోర్డులతో ఎప్పుడూ పనిచేయలేదు. ఇప్పుడు ఆ అవకాశం దక్కడం సంతోషం. కార్డిఫ్‌కు రావడం చాలా బాగుంది. ఇది కొత్త ఫార్మాట్. మంచి ఆదరణ లభిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను' అని కిర్‌స్టన్ పేర్కొన్నారు. 'మహిళలు ఈ టోర్నీలో విజయవంతం అవుతారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. నా చిన్న కొడుకు సిడ్నీ సిక్సర్స్ అభిమాని. అతడు లింగ బేధం చూడడు. కేవలం జట్టును మాత్రమే చూస్తాడు' అని మోట్ తెలిపారు.

ఈ 100 బంతుల టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తోంది. వచ్చే సంవత్సరం జూలై మరియు సెప్టెంబర్ మధ్య ఈ టోర్నమెంట్‌ జరగనుంది. 2020లో ఎనిమిది జట్లతో ఈ ఫార్మాట్‌లో టోర్నీ ఆడించడానికి ఇంగ్లాండ్‌ బోర్డు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక ఇన్నింగ్స్‌లో 100 బంతులు అంటే.. 15 ఓవర్ల వరకు ఓవర్‌కు ఆరు బంతులు వేయించి, పది బంతులతో చివరి ఓవర్‌ ఉండేలా ఈ కొత్త ఫార్మాట్‌ను ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు రూపొందించింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలాంటి భారత స్టార్ ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది.

Story first published: Tuesday, August 13, 2019, 13:23 [IST]
Other articles published on Aug 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+