Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముందు గౌరవించడం నేర్చుకోండి: 'మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తారా?'

హైదరాబాద్: టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ మే 31లోపు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, రిచర్‌ పైబస్‌, దొడ్డ గణేశ్‌ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కుంబ్లే రాజీనామా అనంతరం కోచ్ పదవికి బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడాన్ని కోచ్ ప‌ద‌వి కోసం ద‌రఖాస్తు చేసుకున్న లాల్‌చంద్ రాజ్‌పుత్‌ తప్పుబట్టాడు. ముగింపు తేదీ నాటికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఐదుగురు వ్య‌క్తులు ప‌నికిరారా? వాళ్ల‌పై న‌మ్మ‌కం లేదా? అని ప్రశ్నించారు.

కుంబ్లే రాజీనామా చేసిన వెంటనే మళ్లీ కొత్తగా దరఖాస్తులను ఎందుకు ఆహ్వానించారంటూ రాజ్‌పుత్ బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. నిజానికి కుంబ్లే రాజీనామాతో ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ముందు మరిన్ని అప్లికేషన్స్ ఉంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే బీసీసీఐ నిర్ణయాన్ని రాజ్‌పుత్ తప్పుబట్టాడు. కొత్త ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డం మ‌మ్మ‌ల్ని అవ‌మానించ‌డ‌మే అని క్రికెట్ నెక్ట్ అనే వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో లాల్‌చంద్ స్ప‌ష్టం చేశాడు. ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం కాదు ముందు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిని గౌర‌వించ‌డం నేర్చుకోండి అంటూ బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు.

కోచ్ కావ‌డానికి గొప్ప ప్లేయ‌ర్ అయి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ు

కోచ్ కావ‌డానికి గొప్ప ప్లేయ‌ర్ అయి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ు

కోచ్ కావ‌డానికి గొప్ప ప్లేయ‌ర్ అయి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నాడు. ఇంగ్లాండ్ టీమ్‌తో ట్రెవ‌ర్ బేలిస్‌, దక్షిణాఫ్రికా జట్టుతో ర‌సెల్ డోమింగో చేసిన అద్భుతాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ్ పుత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. గొప్ప ప్లేయ‌ర్ అయినంత మాత్రాన కోచ్‌గా స‌క్సెస్ అవుతాడ‌న్న గ్యారెంటీ ఏమీ లేద‌ని అన్నాడు. టెక్నికల్ నాలెడ్జి, కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంటే సరిపోతుందని అన్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్‌ను బేలిస్‌ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో చూడండని అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో ర‌సెల్ డోమింగో సాధించిన రికార్డులను పరిశీలించాలని బీసీసీఐకి చురకలంటించాడు.

గొప్ప ప్లేయర్ గొప్ప కోచ్ అవుతాడన్న గ్యారెంటీ లేదు

గొప్ప ప్లేయర్ గొప్ప కోచ్ అవుతాడన్న గ్యారెంటీ లేదు

ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప ఆటగాడు గొప్ప కోచ్ అవుతాడని ఎవరూ చెప్పలేదని, బీసీసీఐ దీనిని గుర్తుంచుకుంటే మంచిదని పేర్కొన్నాడు. అంతేకాదు తాను కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో ఇండియ‌న్ టీమ్ 2007లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్‌, పాకిస్థాన్‌పై విజ‌యాలు గుర్తుంచుకోవాల‌ని చెప్పాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలో త‌న‌ను చాలా మంది టీమ్ మేనేజ‌ర్ అనుకున్నార‌ని, కానీ ఆ స‌మ‌యంలో సునీల్ దేవ్ మేనేజ‌ర్ కాగా.. తాను కోచ్‌న‌ని అత‌ను తెలిపాడు.

కుంబ్లే కేవ‌లం ఇండియాలోనే స‌క్సెస్ అయ్యాడు

కుంబ్లే కేవ‌లం ఇండియాలోనే స‌క్సెస్ అయ్యాడు

రెండు రోజుల క్రితం ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన కుంబ్లే కేవ‌లం ఇండియాలో స‌క్సెస్ అయ్యాడేమో కానీ.. త‌న కోచింగ్‌లో టీమిండియా విదేశాల్లో కూడా రాణించింద‌ని గుర్తుచేశాడు. కాగా, ప్రస్తుతం లాల్‌చంద్ రాజ్‌పుత్ ఆఫ్ఘ‌నిస్థాన్ జాతీయ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. గతేడాది కాలంలో అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించిపెట్టాడు. గురువారం ఆప్ఘనిస్ధాన్‌, ఐర్లాండ్ దేశాలకు ఐసీసీ ఆ టెస్టు హోదా కల్పించిన సంగతి తెలిసిందే.

ఆప్ఘనిస్థాన్‌కు టెస్టు హోదా

ఆప్ఘనిస్థాన్‌కు టెస్టు హోదా

లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఐసీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌లు ఆడే దేశాలు పది ఉండగా, ఇప్పుడా సంఖ్య 12కు పెరిగింది. ఇటీవలే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను అప్ఘనిస్థాన్ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. 2011లో వన్డే హోదా పొందిన ఆ జట్టు 2015లో వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు సంపాదించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+