Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ క్రికెటర్ హ్యూస్ మృతి: క్రికెట్‌కు బాధాకరమైన రోజన్న సచిన్

న్యూఢిల్లీ: ఆస్టేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణంపై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందించారు. అతని మరణాన్ని 'క్రికెట్ బాధాకరమైన రోజు' గా అభివర్ణించాడు. సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో ఫిలిప్ హ్యూస్ మరణం బాధాకరం. క్రికెట్‌కు బాధాకరమైన రోజు. అతని ఫ్యామిలీ, స్నేహితులు మంచి కోరుకునే వారికి తన సంతాపాన్ని తెలిపాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిలిప్ హ్యూస్ ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నాడు. 25ఏళ్ల హ్యూస్ దేశీయ టోర్నీలో న్యూ సౌత్ ఆస్టేలియా బౌలర్ విసిరిన బంతి బలంగా తలను తాకడంతో అక్కడిక్కడే పడిపోయాడు.

ఫిలిప్ హ్యూస్‌కు ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రార్ధించాడు. ఆ మరణవార్తను జీర్ణించుకునే శక్తి అతని కుటుంబానికి ఇవ్వాలంటూ శ్రీశాంత్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

హ్యూస్ మరణవార్త తనను దిగ్ర్బాంతికి గురి చేసిందని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశాడు.

హ్యూస్ కుటుంబానికి.. అతనికి శాంతి చేకూరాలని అతనికి ప్రగాడ సానుభూతిని ట్విట్టర్ తెలిపాడు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

హుటాహుటిన విమానంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స్ అందించినా... రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. దీంతో హ్యూస్ మృతికి చాలా మంది సంతాపం తెలిపారు. ఆసీస్ జాతీయ జట్టు కోచ్ డారెన్ లెహ్మన్, హ్యూస్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు.

Hughes' death 'sad day for cricket': Sachin Tendulkar

"లిటిల్ చాంప్... అందరం నిన్ను మిస్సవుతున్నాం" అంటూ పేర్కొన్నారు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. 'ఎంత భయంకరమైన వార్త ఇది' అని పేస్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రాత్ పేర్కొన్నాడు. సొంత జట్టు సౌత్ ఆస్ట్రేలియా హ్యూస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది.

ఇక శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్థనే ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపాడు. ఇప్పుడే ఈ విషాదకర వార్త విన్నామని, అతని కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామనీ అన్నాడు. "హార్ట్ బ్రోకెన్" అంటూ దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలీర్స్ ట్వీట్ చేశాడు. అటు, క్రికెట్ వర్గాలే కాకుండా, ఆస్ట్రేలియా రగ్బీ, సాకర్ క్లబ్ లు కూడా హ్యూస్ మృతికి సంతాపం తెలిపాయి.

హ్యూస్ మృతికి టీమిండియా కూడా సంతాపం తెలియజేసింది. హ్యూస్ అందరినీ వదిలి వెళ్లిపోయాడని పేర్కొంది. అతని కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ద్వారా భారత జట్టు మేనేజ్ మెంట్ ఓ ప్రకటన చేసింది.

ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరో మూడు రోజుల్లో బర్త్ డే జరుపుకోవాల్సి ఉంది. నవంబర్ 30వ తేదీ అతడి పుట్టినరోజు. దీంతో, హ్యూస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని బంధువులు, స్నేహితులు హ్యూస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు.

కొన్ని మ్యాచ్‌లు పాక్షికంగా రద్దు:

ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతితో కొన్ని మ్యాచ్‌లు పాక్షికంగా రద్దు చేశారు. శుక్రవారం నుంచి ఆస్టేలియా ఎలెవన్‌తో జరగాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

ఇక పాకిస్ధాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే చివరి టెస్టు కూడా ఒక రోజు పాటు రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం పాకిస్దాన్ - న్యూజిలాండ్‌ల మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇరు దేశాల బోర్డుల అంగీకారంతో ఆ టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మ్యాచ్‌ను రద్దు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+