టీ20 వరల్డ్ ఛాంపియన్స్ స్వదేశానికి చేరుకున్నారు. బెరిల్ తుఫాను కారణంగా వెస్టిండీస్ లో చిక్కుకుపోయిన భారత జట్టు ప్రత్యేక విమానంలో గురువారం 6 గంటలకు భారత్ గడ్డకు చేరుకుంది. టీ20 ట్రోఫీతో వస్తున్న రోహిత్ సేనకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో తమ భారత క్రికెటర్లకు అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అభిమానులు ఆనందం చూసిన ఆటగాళ్లు సైతం వారితో కలిసి చిందులు వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, సూర్య కుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్ డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ వేశారు.

అనంతరం హోటల్‌లో కాసేపు సేద తీరిన అనంతరం టీమిండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఉదయం 11 గంటలకు మోదీని కలుసుకున్నారు. ప్రధానితో కలిసి అల్ఫాహారం తిన్నారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను మోదీ అభినందించారు. భారత ఆటగాళ్లతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత.. ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నారు.ముంబైలో టీమిండియా ఓపెన్ టాప్ బస్‌లో విక్టరీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఎయిర్ పోర్టు నుంచి వాంఖడే స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

మరికాసేపట్లో ఓపెన్ బస్సులో టీమిండియా ఆటగాళ్లు రోడ్ షో మొదలు కానుంది. ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు గౌరవంగా నిర్వహిస్తున్న విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విక్టరీ పరేడ్‌లో క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పరేడ్ కోసం ముంబై వాసులు ఇప్పటికే భారీగా రోడ్లపైకి వచ్చేశారు. ఈ ఈవెంట్‌కు ఫ్రీ ఎంట్రీ ఉండటంతో.. భారీగా అభిమానులు తరలివచ్చారు. భారీగా అభిమానులు రావడంతో వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది విఫలం కావడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
ముంబైలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. అయినా కూడా క్రికెట్ అభిమానులు వర్షాన్ని లెక్క చేయకుండా టీమిండియా క్రికెటర్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా కోసం స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌ను లైవ్‌లో చూసేందుకు వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడేలో సన్మానం అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని జట్టు సభ్యులకు అందించనున్నారు. విక్టరీ పరేడ్ తర్వాత బీసీసీఐ కార్యాలయంలో టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని ఉంచనున్నారు. ప్రముఖుల అభినందనల తర్వాత రాత్రి వరకు ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి.