For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ఎఫెక్ట్: వెస్టిండిస్ పర్యటనకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ!

ICC Cricket World Cup 2019:Rohit Sharma To Captain India For West Indies Following World Cup Exit
HUGE! Rohit Sharma to captain India for West Indies series following World Cup exit

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా తన తదుపరి పర్యటనపై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆగస్టు 3న టీ20 సిరిస్‌తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో భాగంగా టీమిండియా తన మొదటి రెండు టీ20లను ఫ్లోరిడాలో ఆడనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండిస్ పర్యటనలో ఎవరికి విశ్రాంతినివ్వాలి.. ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై భారత సెలక్టర్లు తలమునకలై ఉన్నారు.

కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి

కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి

అందుతున్న సమాచారం మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికపై ఎలాంటి అంచనాకు రాలేదని తెలుస్తోంది. విండిస్ పర్యటన ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ జులై 17 లేదా 18న ముంబైలో సమావేశమై టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లకు జట్టుని ప్రకటించనున్నారు.

బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ

బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ

ఈ విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "గత మూడు నెలల నుంచి ధోనీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్-12 సమయంలోనే ధోనీ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ప్రపంచకప్ టోర్నీ మధ్యలో ధోనీ చేతి వేళ్లకు బంతి బలంగా తాకడంతో గాయమైంది. వచ్చే ఏడాది నుంచి టీమిండియా విరామం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోనీకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు" అని అన్నారు.

భువనేశ్వర్‌కుమార్ స్థానంలో

భువనేశ్వర్‌కుమార్ స్థానంలో

మరోవైపు విండిస్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఇద్దరినీ టెస్టు సిరిస్‌కు కూడా ఎంపిక చేయకపోవచ్చు. పేసర్ భువనేశ్వర్‌కుమార్ స్థానంలో పేసర్లు ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్‌లలో ఎవరో ఒకరిని జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది.

కోహ్లీకి విశ్రాంతినిస్తే కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కోహ్లీకి విశ్రాంతినిస్తే కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఇక, విండిస్ పర్యటనలో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తాడు. టెస్టు సిరిస్‌కు రహానే నాయకత్వం వహించాడు. అయితే, ఈ విషయమై జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు కోహ్లీ, హెడ్‌కోచ్ రవిశాస్త్రిలను సంప్రదించిన తర్వాత సెలక్టర్లు జట్టు ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Story first published: Friday, July 12, 2019, 19:58 [IST]
Other articles published on Jul 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+