For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వేలంలో త్రిస్టన్ స్టబ్స్ మీద కురిసిన కాసుల వర్షం.. పూర్తి జట్లు ఇవే

Huge Price For Tristan Stubbs In SA20 League Auction, The Complete Six Teams Are..

సౌతాఫ్రికా టీ20 లీగ్ మొట్టమొదటి వేలం సెప్టెంబర్ 19న సోమవారం విజయవంతంగా ముగిసింది. చివరకు ఆరు జట్లు తమ పూర్తి జట్లను ఏర్పరుచుకున్నాయి. ఇకపోతే ఈ వేలంలో దక్షిణాఫ్రికాకు చెందిన సంచలన యువ బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ వేలంపాటలో అత్యధిక ధర పలికాడు. ఐపీఎల్లో మన హైదరాబాదీ ఫ్రాంచైజీ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అతన్ని కొనుకుంది. 9.2మిలియన్ ర్యాండ్ (దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్)ల భారీ ధరకు అతన్ని సన్ రైజర్స్ కొనుక్కుంది. ఇది భారత కరెన్సీలో రూ.4.13కోట్లకు పైచిలుకు ధర.

ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలవే..!

ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలవే..!

ఇకపోతే సౌతాఫ్రికా 20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల యాజమాన్యంలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఎంఐ కేప్ టౌన్ (రిలయన్స్), ప్రిటోరియా క్యాపిటల్స్ (JSW (ఢిల్లీ క్యాపిటల్స్) ), పార్ల్ రాయల్స్ (రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ (రాజస్థాన్ రాయల్స్)), డర్బన్ సూపర్ జెయింట్స్ (RPG-సంజీవ్ గోయెంకా (లక్నో సూపర్ జెయింట్స్) ), జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (ఇండియా సిమెంట్స్ (చెన్నై సూపర్ కింగ్స్) ), మరియు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్).

డీన్ ఎల్గర్, టెంబా బవుమా అన్‌సోల్డ్

ఇకపోతే త్రిస్టన్ స్టబ్స్ తర్వాత.. అత్యధిక ధర పలికిన వారిలో రిలీ రౌసౌ, మార్కో జాన్సేన్ ఉన్నారు. వీరిద్దరు 6మిలియన్ల ర్యాండ్లకు మించిన ధరను పలికారు. వీరిద్దరు వేలంలో అన్ని జట్ల దృష్టిని ఆకర్షించారు. రౌసౌను ప్రిటోరియా క్యాపిటల్స్ 6.9 మిలియన్ల ర్యాండ్లు (3.10కోట్లు) పెట్టి కొనుగోలు చేయగా, జాన్సేన్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6.1M ర్యాండ్లు (2.74కోట్లు) పెట్టి కొనుగోలు చేసింది. చాలా మంది ఆటగాళ్ళు పెద్ద మొత్తంలో ధర పలికారు. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్, వన్డే, టీ20ల కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ బౌలర్ ఆండిలే ఫెహ్లుక్వాయోలు వేలంలో అమ్ముడుపోలేదు.

తొలుత నీషమ్, మోర్గాన్ అమ్ముడుపోకున్నా..

ఇక మంచి ధర పలికిన వారిలో వేన్ పార్నెల్, సిసాండా మగాలా ఉన్నారు. ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు 5 మిలయన్ల ర్యాండ్ల కంటే ఎక్కువ ధర పలికారు. న్యూజిలాండ్ స్టార్ జేమ్స్ నీషమ్, మాజీ ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్‌లను తొలుత ఎవరూ కొనుక్కోలేదు. కానీ తరువాత పార్ల్ రాయల్స్ నీషమ్‌ను, ప్రిటోరియా క్యాపిటల్స్ మోర్గాన్‌ను కొన్నాయి. జోహెన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్ 5.5మిలియన్ల ర్యాండ్లు (రూ.2.47కోట్లు) పెట్టి డోనోవన్ ఫెర్రేరియాను కొంది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్లు అయిన క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నారు.

SA20లో జట్లు వాటి స్క్వాడ్లు

SA20లో జట్లు వాటి స్క్వాడ్లు

1. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, గెరాల్డ్ కోయెట్జీ, మహేశ్ తీక్షణ, రొమారియో షెపర్డ్, హ్యారీ బ్రూక్, జాన్నెమాన్ మలన్, రీజా హెండ్రిక్స్, కైల్ వెర్రెయిన్, జార్జ్ గార్టన్, అల్జారీ జోసెఫ్, లెయుస్ డు ప్లూయ్, లూయిస్ గ్రెగొరీ, లిజాడ్ విలియమ్స్, డోనావోన్‌డ్లు బ్రిటోర్‌బో, నాన్‌లు బ్రిటోగర్, కాలేబ్ సెలెకా

2. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ : ఐడెన్ మార్క్‌రామ్, ఒట్నీల్ బార్ట్‌మాన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, సిసాండా మగాలా, జునైద్ దావూద్, మాసన్ క్రేన్, జోన్-జోన్ స్మట్స్, జోర్డాన్ కాక్స్, ఆడమ్ రోసింగ్‌టన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, మార్క్వెస్ అకెర్‌మాన్, జేమ్స్ ఫుల్లర్, సరెల్యా కార్వీ, ఎర్యడన్ కార్వీ గ్కమనే, టామ్ అబెల్

3. పార్ల్ రాయల్స్ : డేవిడ్ మిల్లర్, కార్బిన్ బాష్, జోస్ బట్లర్, ఒబెడ్ మెక్‌కాయ్, లుంగి ఎన్‌గిడి, తబ్రైజ్ షమ్సీ, జాసన్ రాయ్, డేన్ విలాస్, జోర్న్ ఫోర్టుయిన్, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇమ్రాన్ మనక్, ఇవాన్ జోన్స్, రామోన్ సిమండ్స్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడియిన్ యూసుఫ్

4. డర్బన్ సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, ప్రేనెలన్ సుబ్రాయెన్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లీ, డ్వైన్ ప్రిటోరియస్, హెన్రిచ్ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహరాజ్, కైల్ అబాట్, జూనియర్ డాలా, దిల్షన్ మధుశంక, జాన్సన్ చార్లెస్, మాథ్యూ బ్రీట్జ్కేర్, క్రిస్టియా బ్రెట్జ్కేర్, హర్మర్

5. ఎంఐ కేప్‌టౌన్ : కగిసో రబాడా, డెవాల్డ్ బ్రెవిస్, రషీద్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరాన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, బ్యూరాన్ హెండ్రిక్స్, డువాన్ జాన్సెన్, డెలానో పోట్‌గీటర్, గ్రాంట్ రోలోఫ్సెన్, వెస్లీ మార్షల్, ఒల్లీ స్టోన్, అబ్లీ స్టోన్, ఓడియన్ స్మిత్

ప్రిటోరియా క్యాపిటల్స్ : అన్రిచ్ నార్జ్, మిగేల్ ప్రిటోరియస్, రిలీ రోసోవ్, ఫిల్ సాల్ట్, వేన్ పార్నెల్, జోష్ లిటిల్, షాన్ వాన్ బెర్గ్, ఆదిల్ రషీద్, కామెరాన్ డెల్పోర్ట్, విల్ జాక్స్, థ్యూనిస్ డి బ్రూయిన్, మార్కో మరైస్, కుసల్ మెండిస్, డారిన్ డుపవిల్లోన్, జిమ్మీ డ్యు పవిల్లోన్, షేన్ డాడ్స్వెల్

Story first published: Tuesday, September 20, 2022, 14:25 [IST]
Other articles published on Sep 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+