గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్, జోస్ బట్లర్ దేశస్థుడైన ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బాంటన్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. వేలి గాయంతో బాధపడుతున్న టామ్ బాంటన్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఐపీఎల్ అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఈ వార్త శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టును కలవరపెడుతోంది.
కొత్త ప్లేయర్ ఎంట్రీ
టామ్ బాంటన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ వేగంగా పావులు కదిపింది. దక్షిణాఫ్రికాకు చెందిన యువ వికెట్ కీపర్, బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుజెన్‌ను బాంటన్ రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి తీసుకుంది. కేవలం రూ. 75 లక్షల బేస్ ధరతో ఎస్టర్‌హుజెన్ గుజరాత్ జట్టులో చేరాడు. 24 ఏళ్ల ఈ యువ ప్లేయర్ ఐపీఎల్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. టామ్ బాంటన్ దూరం కావడంతో వచ్చిన లోటును ఈ యువ సంచలనం ఏ మేరకు భర్తీ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎవరీ కానర్ ఎస్టర్‌హుజెన్?
దక్షిణాఫ్రికా క్రికెట్‌లో కానర్ ఎస్టర్‌హుజెన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా కానర్ ఎస్టర్‌హుజెన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎస్టర్‌హుజెన్.. రెండుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను గెలుచుకోవడమే కాకుండా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికా 1-2తో వెనుకబడిన స్థితి నుంచి సిరీస్‌ను 3-2తో గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
కీలక దశలో మార్పు
ఐపీఎల్ టోర్నమెంట్ అత్యంత కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. ఈ హోమ్ మ్యాచ్‌కు ముందే కొత్త ఆటగాడు జట్టుతో చేరనుండటం గిల్ సేనకు కొంత ఊరటనిచ్చే విషయమే. దక్షిణాఫ్రికాలో తన సత్తా చాటిన ఈ యువ హిట్టర్, భారత గడ్డపై ఐపీఎల్ అరంగేట్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications