విశాఖపట్నం: 'స్వచ్ఛమైన నీరు.. పరిశుభ్రమైన రహదారులు.. ఆహ్లాదకరమైన జీవనం.. విశాఖపట్నం నన్ను ఎంతగానో ఆకట్టుకుంద'ని టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. శ్రీలంకతో టీ20 సిరిస్‌లో భాగంగా టీమిండియా జట్టు ఆదివారం విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ప్రకృతి అందాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను రోహిత్ శర్మ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. గతంలో కూడా విశాఖపట్నంపై రోహిత్ స్పందించిన సంగతి తెలిసిందే. తన మాతృభాష తెలుగని, తన తల్లి వైజాగ్‌కు చెందిన వారని రోహిత్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన టీ20 మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 13 పరుగులకే పెవిలయన్‌కు చేరినప్పటికీ, ధావన్ నిలకడగా రాణించి జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ విజయంతో 2-1 తేడాతో సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంది. టీ20ల్లో అత్యంత అద్భుతంగా బౌలింక్ వేసిన అశ్విన్‌ను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుతో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు వరించింది.