గంగూలీ బయోపిక్.. హీరోగా హృతిక్.. నగ్మా ఎఫైర్ సీన్స్ ఉంటాయా?!!

ముంబై: బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. క్రికెట్ దిగ్గజాలైన ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌ల మీద వచ్చిన బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సిద్దమవుతోంది. తాజాగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ '83' తెరకెక్కుతోంది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి బయోపిక్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో మరో క్రికెట్ దిగ్గజం బయోపిక్ తెరకెక్కనుంది.

దాదా బయోపిక్‌లో హృతిక్:
గాడి తప్పిన ఇండియన్ క్రికెట్ జట్టును ఒంటిచేత్తో విజయవంతంగా నడిపించిన మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదా బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయమై ఇప్పటికే గంగూలీ, హృతిక్‌ను కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏదైనా విషయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

గంగూలీ ఆసక్తి:
తన జీవిత చరిత్రను తెరకెక్కించే విషయంలో సౌరవ్ గంగూలీ కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు గంగూలీ పాత్రలో నటించనున్న హృతిక్ రోషన్ కూడా ఆతృతగా ఉన్నాడట. క్రీడా దిగ్గజాల బయోపిక్‌లు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు దక్కించుకోవడంతో మరిన్ని బయోపిక్‌లను తెరకెక్కించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇక దాదా అభిమానుల ఆకాంక్షను నెరవేరుస్తూ త్వరలోనే అతని జీవిత చరిత్ర తెరకెక్కే అవకాశాలున్నాయి.

నగ్మాతో ఎఫైర్:
గంగూలీ యుక్త వయసులో ఉన్నప్పుడు హీరోలా ఉండేవాడు. ఎందరో దాదాను చాటుగా ప్రేమించారు. ఇక సౌరవ్ గంగూలీ నిజ జీవితంలో కూడా ప్రేమ వ్యవహారం ఉంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మాతో దాదా చాలా కాలం ఎఫైర్ సాగించాడు. అయితే నగ్మాతో గంగూలీ సాగించిన ప్రేమాయణం గురించి దాదా బయోపిక్‌లో చూపిస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే కాబట్టి నగ్మా ఎఫైర్ సీన్స్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.

బీసీసీఐ బాస్‌గా:
కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో టీమిండియా ప్రపంచకప్ ముద్దాడింది. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక గంగూలీ 2000లో కెప్టెన్‌గా భాద్యతలు స్వీకరించే సమయానికి టీమిండియా ఫిక్సింగ్ ఆరోపణలతో కుదేలైంది. దాదా తన దూకుడుతో జట్టును గాడిలో పెట్టి ఏకంగా 2003 ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత టీమిండియా వెనక్కితిరిగి చూసుకోలేదు. దాదా ఎందరో యువ ఆటగాళ్లకు జీవితాలను ఇచ్చాడు. ఇందులో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు కూడా ఉన్నారు. ప్రస్తుతం దాదా బీసీసీఐ బాస్‌గా ఉన్నాడు. ఇప్పటికీ తన మార్క్ చూపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications