Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీ పొరపాటు: పెళ్లి పత్రికపై మోడీ పేరు తప్పుగా

హైదరాబాద్: ఈనెల 30న చండీగఢ్‌లో ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పెళ్లికి ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. తల్లి షబ్నం సింగ్‌తో కలిసి గురువారం పార్లమెంట్‌కు వచ్చిన యువ‌రాజ్ తన పెండ్లి పత్రికను ప్రధాని మోడీకి అందజేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ పేరుని తన పెళ్లి పత్రికపై యువరాజ్ సింగ్ తప్పుగా ప్రచురించాడు. ఈ విషయాన్ని అతడు గుర్తించక పోవడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ అని కాకుండా ప్రధాని (నరేందర్‌ మోడీ) అంటూ అక్షర దోషంతో ఉన్న పెళ్లి ఆహ్వాన పత్రికతో ఆయన పార్లమెంటు వద్ద కనిపించారు.

ప్రధాని మోడీ పేరు తప్పుగా

ప్రధాని మోడీ పేరు తప్పుగా

పెళ్లి ఆహ్వాన పత్రికతో పార్లమెంట్ ఆవరణలో తల్లితో కలిసి యువరాజ్ సింగ్ అటుగా వెళుతున్న సమయంలో ఆయన చేతిలోని పెళ్లి కార్డును చూసిన విలేకర్లు వెంటనే తమ చేతుల్లోని కెమెరాలతో దానిని బంధించగా ఆ కార్డుపై ప్రధాని మోడీ పేరు తప్పుగా ఉన్నట్లు గుర్తించారు.

సమర్ధించుకున్న అభిమానులు

సమర్ధించుకున్న అభిమానులు

దీనిపై ఇంటర్నెట్‌లో పలు రకాల వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లంటే హడావుడిగా బిజీ బిజాగా ఉంటారు కాబట్టి ఇలాంటి సమయాల్లోని చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమేనని యువరాజ్ అభిమానులు దానిని సమర్ధించుకుంటున్నారు.

ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో

ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో

ఇదిలా ఉంటే హాలీవుడ్ నటి, మోడల్‌ హజల్ కీచ్‌తో యువరాజ్ వివాహం నిరాడంబరంగా జరగనుంది. ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో యువీ వివాహం చేసుకోనున్నాడు. ఈ వేడుకకు 60 మంది అతిథులే హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం

డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం

ముందుగా 30న సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 5న చత్తార్‌పూర్‌లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+