న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కేరీర్‌పై ఆస‌క్తిక‌ర ప‌జిల్‌: సాల్వ్ చేయ‌గ‌ల‌రా?

How well you know MS Dhoni? Find seven things related to him on his 38th Birthday

లండ‌న్‌: టీమిండియా మాజీ కేప్టెన్, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌న 38వ పుట్టిన‌రోజును జ‌రుపుకొంటున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ప్ర‌స్తుతం టీమిండియా జ‌ట్టుతో క‌లిసి ఇంగ్లండ్‌లోని మాంచెస్ట‌ర్‌లో ఉంటోన్న ధోనీ ఆదివారం భార్య సాక్షి, కుమార్తె జివా, తోటి క్రికెట‌ర్ల‌తో క‌లిసి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటున్నాడు. ధోనీ బ్యాటింగ్ శైలిపై మొన్న‌టి దాకా అనుమానాలు లేవ‌నెత్తిన మాజీ క్రికెట‌ర్లు స‌చిన్ టెండుల్క‌ర్‌, వీరేంద్ర సెహ్వాగ్ సైతం మ‌హీభాయ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ట‌ర్బొనేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ త‌మిళంలో ట్వీట్ చేయ‌డం విశేషం.

ప్ర‌స్తుతం భ‌జ్జీ.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌ర‌ఫున ఆడుతున్నందున‌.. త‌న కేప్టెన్‌కు త‌మిళంలో శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా ధోనీ కేరీర్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన ప‌జిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ధోనీ కేరీర్‌లో అత్యంత కీల‌క‌మైన ఏడు అంశాల‌ను ఈ ప‌జిల్‌లో పొందు ప‌రిచారు. ధోనీ గురించి, అత‌ని కేరీర్ గురించి పూర్తి అవ‌గాహ‌న ఉన్న అభిమానులెవరైనా స‌రే! ఈ ప‌జిల్‌ను సులువుగానే ప‌రిష్క‌రించ‌గ‌ల‌రు. దాని కోసం త‌మ పాత జ్ఞాప‌కాలను తాజాగా నెమ‌రు వేసుకోవాల్సి ఉంటుంది. బుర్ర‌కు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆ ఏడు అంశాలు ధోనీ కేరీర్‌కు సంబంధించిన‌వే.

Story first published: Sunday, July 7, 2019, 17:22 [IST]
Other articles published on Jul 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X