దటీజ్ సచిన్: హోటల్ వెయిటర్ ఇచ్చిన సలహాను పాటించాడు
హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మందికి సచిన్ టెండూల్కర్ ప్రేరణగా నిలిచాడు. క్రికెట్‌లో ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో అన్ని రికార్డులను సచిన్ తన పేరిట లిఖించాడు. అలాంటి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు ఓ హోటల్ వెయిటర్ ఆటకు సంబంధించిన సలహా చెప్పాడు. అయితే సచిన్ దానిని తేలిగ్గా తీసుకోకుండా పాటించాడు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా వెల్లడించడం విశేషం.

ఎవరి సలహాలనైనా స్వీకరించడానికి సిద్ధం
‘మనం ఓపెన్ మైండ్‌తో ఎవరి సలహాలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఎంతో మెరుగవుతాం. చెన్నైలో ఒకసారి హోటల్ వెయిటర్ నా దగ్గరికి వచ్చి మీరేం అనుకోనంటే ఒక విషయం చెబుతానన్నాడు. నేను అప్పుడు 'చెప్పు' అని అన్నా. నా మోచేతి గార్డ్ వల్ల నా బ్యాట్ ఊపు దెబ్బ తింటోందని చెప్పాడు. అతను చెప్పింది 100 శాతం నిజం' అని సచిన్ చెప్పుకొచ్చాడు.

మోచేతి గార్డ్ అసౌకర్యంగా అనిపించింది
'నాకు ఎప్పటి నుంచో మోచేతి గార్డ్ అసౌకర్యంగా అనిపించింది. కానీ మార్చుదామని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే అతను చెప్పిన వెంటనే నేను నా మోచేతి గార్డ్‌ను మార్చుకున్నాను. మన దేశంలో పాన్‌వాలా దగ్గర్నుంచి సీఈఓ వరకు అందరూ సలహాలిస్తారు. మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి'' అని సచిన్ తెలిపాడు.

క్రికెట్ వస్తువులతో సచిన్ బాండింగ్
ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ వస్తువులతో తనకున్న బంధాన్ని వివరించాడు.

బ్యాట్ తన బాషలో నాతో మాట్లాడుతుందని చెప్పా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో డేన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌తో ఆడుతున్న సమయంలో బ్యాట్‌తో కొట్టడాన్ని వారు పలుమార్లు ప్రశ్నించారు. అప్పుడు నేను వారితో బ్యాట్ తన బాషలో తనతో మాట్లాడుతుందని సమాధానమిచ్చా' అని సచిన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications