కోహ్లీతో ప్లాన్ చెప్పి బంతులు సంధించా: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా
హైదరాబాద్: ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న ఇంగ్లాండ్‌లో పిచ్‌లు భిన్నంగా ఉంటాయి. ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతి స్వింగ్ అవడం కష్టం. అలాంటి పిచ్‌లపై కూడా టీమిండియా పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించినా, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓటమిపాలవడంతో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

బుమ్రా అద్భుత ప్రదర్శన
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన వల్లే టీమిండియా విజయం సాధించిందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో కీలక ప్రదర్శన చేసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది. మ్యాచ్ అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లాండ్‌లో మొదటిసారి ఆడుతున్నా కోహ్లీ నన్ను నమ్మి కీలక సమయాలలో బంతిని ఇవ్వడంతో పాటు ఒత్తిడి లేకుండా చేశాడని చెప్పాడు.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని ముద్ర వేస్తున్నారు
పూర్తి స్వేచ్చగా బౌలింగ్ చేశానని, ఓ యువ బౌలర్‌గా తానేమీ చేయగలనో అదే చేశానని బుమ్రా తెలిపాడు. 'భువీని స్వింగ్ కింగ్ అన్నట్లు నన్ను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. అయితే ఇలాంటి ముద్ర ఏ బౌలర్‌కైనా ప్రమాదకరమే. ఎందుకంటే కెప్టెన్ ఏ సమయంలో బంతి ఇచ్చినా బౌలర్ తన పని నిర్వహించగలడని విశ్వసించాలి' అని అన్నాడు.

వారి సలహాలతో మంచి ఫలితాలు రాబట్టా
'తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడుతున్నందున సీనియర్లు భువనేశ్వర్, కోహ్లీ, ధోనీ, కోచ్ కుంబ్లే సలహా మేరకు బౌలింగ్ చేసి మంచి ఫలితాలు రాబట్టాను. కోహ్లీ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అందువల్లే నా ప్రణాళికలను చెప్పి అందుకనుగుణంగా బంతులను సంధిస్తూ వికెట్లు సాధిస్తున్నాను' అని బుమ్రా చెప్పాడు. ఇక స్వింగ్ విషయంలో మాత్రం భువీని సంప్రదించానని తెలిపాడు.

లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టడి
భువీ సూచన మేరకు లైన్ అండ్ లెంగ్త్ బంతులేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో పైచేయి సాధించానని బుమ్రా వివరించాడు. సెమీస్‌కు చేరాలంటో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి టీమిండియా సెమీస్‌కు చేరింది. జూన్ 15 (గురువారం) జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఎలో ఉన్న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ఫైనల్‌కి చేరుకుంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పాక్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications