ఐపీఎల్‌లో అంతలా ఆడటంలో సీక్రెట్ బయటపెట్టిన అంబటి రాయుడు

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. 2018 సీజన్‌లో 602 రన్స్ చేసిన రాయుడు.. చెన్నై టీమ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సక్సెస్ సాధించడం వెనుక ఓ సీక్రెట్ ఉందట. జట్టు సహచరుడు హర్భజన్‌తో కలిసి యూట్యూబ్ టాక్ షో 'క్విక్ హీల్ భజ్జీ బ్లాస్ట్' అనే కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

విరాట్ కోహ్లి.. కాస్త తిడుతూనే ఇచ్చాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి ఏటా ఒక క్రికెట్ బ్యాట్ తీసుకుంటాను. ఇది ఆనవాయితీ. ఆ బ్యాట్ నాకు ఎంతో కలిసి వస్తోంది' అది అదృష్టం తెచ్చి పెడుతున్నదని విరాట్‌కు కూడా అర్థమై.. ఈసారి బ్యాట్ అడిగితే కాస్త తిడుతూనే ఇచ్చాడు అంటూ రాయుడు సీక్రెట్ వెల్లడించాడు. అని చెప్పుకొచ్చాడు హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన రాయుడు అద్భుతంగా రాణించాడు.

క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదని
మొత్తం 16 మ్యాచ్‌ల్లో రాయుడు 602 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయుడు నాలుగో స్థానంలో నిలిచాడు. రూ.2.20కోట్లు చెల్లించి వేలంలో రాయుడ్ని చెన్నై దక్కించుకుంది. ఇక మొదట్లో తనకు క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదని, తన తండ్రి వల్లే ఈ కెరీర్ ఎంచుకున్నట్లు కూడా తెలిపాడు. నాకు చదువు అంటేనే బాగా ఇష్టముండేది. అయితే మా నాన్న నన్ను ఓ క్రికెట్ క్యాంప్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నా అని రాయుడు చెప్పాడు.

రాయుడు దగ్గర మొబైల్ ఫోనే లేదట
ఇప్పటివరకు రాయుడు దగ్గర మొబైల్ ఫోనే లేదట. తాను దేని గురించైనా ఆలోచించే సమయంలో ఫోన్ వస్తే ఆలోచించడం మానేస్తానని, అందుకే మొబైల్ వాడనని చెప్పాడు. లక్ష్మణ్, సచిన్, రికీ పాంటింగ్ తన ఫేవరెట్ క్రికెటర్లని రాయుడు అన్నాడు. చిన్నప్పటి నుంచీ నాకు లక్ష్మణ్ ఆరాధ్య ఆటగాడు.

సచిన్ ఎంతో వినయంగా
ముంబై ఇండియన్స్‌కు వచ్చిన తర్వాత సచిన్, పాంటింగ్‌ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంత సాధించిన తర్వాత కూడా సచిన్ ఎంతో వినయంగా ఉంటారు. ఇప్పటికే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అది నాకు అతనిలో బాగా నచ్చింది అని రాయుడు తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ తరఫున మంచి ప్రదర్శనతో పాటు ఐపీఎల్‌లోనూ రాణించిన రాయుడును బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications