న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిట్ నెస్ సమస్యలు ఎప్పటినుంచో వేధిస్తున్నాయ్: కోహ్లీ

India vs Australia 4th Test : How Virat Kohli Deals With His Fitness Issues ? | Oneindia Telugu
How Virat Kohli deals with his back issues

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నాడట. ఆ విషయాన్ని మీడియా ముందు బుధవారం కోహ్లీ వెల్లడించాడు. మెల్‌బౌర్న్‌ టెస్టుకు ముందు కోహ్లీకి వెన్ను నొప్పి రావడంతో ఫిజియో చికిత్స చేయించుకున్నాడట. ఇంత సతమతమవుతూనే బరిలోకి దిగి పోరాడటం కష్టంగా అనిపించిందని కోహ్లీ అన్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా సమస్యలెదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అనే దానిపై కోహ్లీ ఇలా సూచించాడు.

ఫిట్‌నెస్‌ సమస్యలు కొత్తగా రాలేదు

ఫిట్‌నెస్‌ సమస్యలు కొత్తగా రాలేదు

‘నాకు ఫిట్‌నెస్‌ సమస్యలు 2011 నుంచి ఉన్నాయి. ఇప్పుడేం కొత్తగా రాలేదు. కానీ దీనిపై జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాను. పని ఒత్తిడి ఎక్కువైతే ఆ ప్రభావం కచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అదే స్థాయిలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోగలిగితే కొద్ది రోజుల్లోనే కుదుటపడగలం. అందుకే నేను కూడా ఈ విషయంపై ఎక్కువగా ఆందోళన చెందను. కాకపోతే దానికి పరిష్కారం వెతికే ప్రత్యామ్నాయం చూస్తాను. ఫిట్‌నెస్‌పై సమస్యలొచ్చినంత మాత్రాన మానసికంగా కుంగిపోకుండా జాగ్రత్తగా పోరాడాలి.

టీమిండియా కల నెరవేరబోతోందంటున్న కోహ్లీ

టీమిండియా కల నెరవేరబోతోందంటున్న కోహ్లీ

నాలుగుటెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన నాలుగో టెస్టు గెలిస్తే.. టీమిండియా కల నెరవేరబోతోందని కోహ్లీ పేర్కొన్నాడు. '2014లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నప్పుడే ధోనీ రిటైరయ్యాడు. అందరూ యువకులతో కూడిన భారత జట్టు అప్పుడు టెస్టుల్లో 7వ స్థానంలో ఉండేది. నెంబర్ వన్ జట్టుగా ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సిరీస్ నెగ్గడమే తమ ముందున్న లక్ష్యం

సిరీస్ నెగ్గడమే తమ ముందున్న లక్ష్యం

ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గితే తన కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత ఆడే ప్రతీ సిరీస్‌లోనూ తమ స్థాయికి తగ్గట్టుగా రాణించి ఇదే జైత్రయాత్ర కొనసాగిస్తాం. టీమిండియా రికార్డ్‌లు బద్దలు కొట్టడానికో, చరిత్ర సృష్టించడానికో ఆడటం లేదు. అంచనాలకు తగ్గట్టుగా రాణించి ఒక్కో సిరీస్ నెగ్గడమే తమ ముందున్న లక్ష్యం. రికార్డుల గురించి ఆలోచిస్తే తమ జట్టు ఇంతలా సక్సెస్ అయ్యి ఉండేది కాదు.

Story first published: Thursday, January 3, 2019, 9:18 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X