Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో: అక్కడ మరో బూమ్రా తయారవుతున్నాడుగా: అచ్చం అదే స్టైల్ లో బౌలింగ్

Under-13 Cricketer In Hong Kong Bowling Like Jasprit Bumrah | Oneindia Telugu
how U-13 boy from Hong Kong copies the style of this Indian bowler

హాంకాంగ్: భారత క్రికెట్ జట్టు తురుపుముక్క జస్ ప్రీత్ బూమ్రా బౌలింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. అందరు బౌలర్లలా తన కుడి చేతిని రొటేట్ చేయడతను. మోచేతిని ఎక్కడా ఒక్క ఇంచ్ కూడా వంచడు. అంపైర్ భుజాలకు సమాంతరంగా చేతిని తీసుకెళ్లి, బౌల్ చేస్తాడు. డెత్ ఓవర్ల ఎక్స్ పర్ట్ గా పేరున్న బూమ్రా వేసే యార్కర్లను కాచుకోవడం దాదాపు అసాధ్యం.

అదలావుంచితే- హాంకాంగ్ లో ఓ బాలుడు అచ్చు బూమ్రా శైలిని అనుకరిస్తున్నాడు. ప్రస్తుతం హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న అండర్-13 లీగ్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. పేరేంటో తెలియట్లేదు గానీ.. ఆదివారం ఉదయం హాంకాంగ్ లో జరిగిన మ్యాచ్ లో అచ్చం బూమ్రాలాగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

అతని బౌలింగ్ ను వీడియో తీసిన క్రికెట్ హాంకాంగ్ బోర్డు.. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ లో ఎక్కడా బూమ్రా పేరును రివీల్ చేయలేదు. అండర్-13 బౌలర్ బౌలింగ్ యాక్షన్ చూస్తోంటే.. ఎవరు గుర్తుకొస్తున్నారు? అని ఓ క్వశ్చన్ మార్క్ వేసి వదిలి పెట్టేసింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చే నడుస్తోంది. ఇదివరకు బూమ్రా శైలిలో బౌలింగ్ చేస్తున్న పిల్లల వీడియోలు చాలానే వెలువడినప్పటికీ.. ఓ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ లో వెలుగు చూడటం ఇదే తొలిసారి.

Story first published: Sunday, March 3, 2019, 18:44 [IST]
Other articles published on Mar 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+