IND vs SL: కీలక భారత్ వర్సెస్ లంక మ్యాచ్ ఫ్రీగా చూడాలంటే ఎలా?

ఆసియా కప్ మెగా టోర్నమెంట్ సూపర్ 4 దశలో భారత్ రెండో మ్యాచ్ ఇవ్వాళ ఆడబోతుంది. భారత్ వర్సెస్ శ్రీలంక నేటి మ్యాచ్‌లో ఢీకొననున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు తలపడలేదు. పైగా ఇటీవల శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరు జట్ల మధ్య టఫ్ పోటీ ఖాయంగా కన్పిస్తుంది. పైగా ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇండియా 10, శ్రీలంక 10 మ్యాచ్‌లు గెలిచి చెరి సమానంగా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ప్రభ కోల్పోయిన లంక టీం ఇటీవల మళ్లీ రేసులోకి వచ్చింది. అందువల్ల భారత్ పకడ్బందీ వ్యూహంతో లంకపై బరిలోకి దిగాల్సిన అవసరం నెలకొంది.

ఆత్మవిశ్వాసం పుంజుకుని బరిలోకి దిగాల్సిన అవసరం
ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30గంటలకు ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం చూసుకుంటే.. సాయంత్రం 6గంటలకు మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4దశలో ఇది మూడో మ్యాచ్. శనివారం రాత్రి జరిగిన తొలి గేమ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంక రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే అవకాశముండగా.. ఆదివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయింది. అందువల్ల తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని భారత్ బరిలోకి దిగాల్సిన అవసరముంది.

స్టార్ స్పోర్ట్స్ కాకుండా ఆ ఛానల్లో చూస్తే ఫ్రీ
భారత్- శ్రీలంక మ్యాచ్‌ను స్టార్ స్పోర్స్ట్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్ కాస్టర్‌గా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. హాటస్టార్ వెబ్‌సైట్ కూడా మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే వీటిల్లో చూడడానికి కాస్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ పెయిడ్ ఛానల్ కాగా.. డిస్నీ హాట్ స్టార్‌కు సబ్ స్క్రిప్షన్ మండెటరీ. అయితే ఈ మ్యాచ్ ఉచితంగా చూడటానికీ ఓ అవకాశం ఉంది. అదే దూరదర్శన్ నెట్ వర్క్. డీడీ స్పోర్ట్స్ ఛానల్ భారత్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌ను డీడీ ఫ్రీడిష్ ఆధ్వర్యంలో డీడీ స్పోర్ట్స్ ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీనికి ఎలాంటి సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. సూపర్-4 దశలో భారత్ ఆడే మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్రెడీ పాక్ మ్యాచ్‌ను మొన్న ప్రసారం చేసిన డీడీ స్పోర్ట్స్, నేటి మ్యాచ్‌తో పాటు 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడే టీమిండియా మ్యాచ్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆల్ ఇండియా రేడియో లైవ్ కామెంట్రీని కూడా అందిస్తుంది. ఇక మ్యాచ్ స్కోరు మాత్రమే చూసే వీలున్నవాళ్లకు చాలా క్రికెట్ యాప్స్, న్యూస్ సైట్స్ స్కోరు కార్డును అందిస్తాయి.

తుది జట్ల అంచనా :
భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్
శ్రీలంక ప్లేయింగ్ 11: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications