
సుమారు రెండేళ్ల విరామం తర్వాత.. మన హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య సెప్టెంబర్ 20నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 25న ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్లు Paytm ఇన్‌సైడర్ యాప్‌లో సెప్టెంబర్ 15 నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. పేటీఎం లేదా పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్లో ఈ టికెట్లు ఈ రోజు సాయంత్రానికల్లా ఓపెన్ కావొచ్చు. ఇకపోతే మ్యాచ్ రోజున గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ల టిక్కెట్‌లకు భారీ డిమాండ్ ఉంది. టిక్కెట్ ధరలు దాదాపు రూ.800నుంచి ప్రారంభం కావొచ్చు. జీఎస్టీ అదనం. స్టూడెంట్లకు ప్రత్యేక రాయితీతో టికెట్లు అందుబాటులో ఉంటాయి.
టిక్కెట్లు ఎలా కొనుగోలు చేయాలి:
టిక్కెట్లు Paytm ఇన్‌సైడర్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్లను స్టేడియం కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. స్టూడెంట్లు తమ ఐడీ కార్డులు చూపించి స్టేడియం వద్ద రాయితీ టిక్కెట్లు మ్యాచ్ ముందు రోజు నుంచి కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి అయితే టిక్కెట్ల సేల్ లింకు ఇంకా ఓపెన్ కాలేదు. టిక్కెట్ల కొనుగోలుకు సంబంధించి ఏ లింకును గుడ్డిగా నమ్మకుండా యూజర్లు జాగ్రత్తగా ఉండాలి.
ఆస్ట్రేలియాతో మూడో టీ20కి బరిలో దిగే భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్. షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా