IPL Media Rights: వేలం ద్వారా వచ్చిన రూ.48,390కోట్ల డబ్బులను బీసీసీఐ ఎలా ఖర్చుపెట్టనుందో తెలుసా?

ఐపీఎల్ 2023-27 మీడియా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. తాజా వేలం ద్వారా ప్రపంచంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యధిక మీడియా హక్కుల ఆదాయాన్ని ఆర్జించే రెండో క్రీడా టోర్నీగా అవతరించింది. ఇక బోర్డ్ ఆఫ్ క్రికెట్ సెంటర్ ఇన్ ఇండియా (BCCI)కు కాసుల వర్షం కురిసింది. రూ.48,390 కోట్ల భారీ మొత్తాన్ని మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సొంతం చేసుకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నమెంట్‌గా ఐపీఎల్ పేరొందింది.
ఇక క్రికెట్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న దేశాల్లోనూ ఐపీఎల్ వీక్షకుల సంఖ్య అధికంగా ఉంది. ఇక క్రమేపీ ఈ లీగ్ ప్రజాదరణ సైతం పెరుగుతూ పోయింది. ఈ సంవత్సరం రెండు కొత్త జట్లు (లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడం వల్ల టోర్నీ మరింత సక్సెస్ అయింది. అలాగే ఐపీఎల్లో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది.
ఎలా పంచాలనేదానిపై బీసీసీఐ ప్లాన్లే.. ప్లాన్లు
ఇక ఇంత భారీ మొత్తాన్ని బీసీసీఐ అందుకోవడంతో ఈ మనీని బీసీసీఐ ఎలా ఖర్చుపెడుతుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక దేశంలో యువ ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తేవడానికి, ఇతర క్రికెట్ ప్రగతి కర కార్యక్రమాల కోసం వెచ్చించేందుకు వాడుతామని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక అర్హులైన సిబ్బందికి, అధికారులకు, వాటాదారులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, ఆటగాళ్లకు, స్టేట్ అసోసియేషన్లకు, వాటి సిబ్బందికి ఈ మొత్తం ఆదాయాన్ని తగు మొత్తంలో పంచేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకే కాసులే కాసులు
ఐపీఎల్లోని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్టకు రూ.48,390కోట్లలో సగం మనీ అంటే.. 24,195కోట్ల డబ్బులను బీసీసీఐ పంచనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశాడు. ఈ ఎనిమిది ఫ్రాంఛైజీలు రూ.3,000కోట్ల చొప్పున డబ్బులు అందుకోనున్నాయి. రెండు కొత్త జట్లు అయిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ మొత్తాన్ని అందుకోవడానికి మరో అయిదేళ్ల దాకా వేచి ఉండాల్సి వస్తుంది.
ప్లేయర్లకు, స్టేట్ అసోసియేషన్లకు డబ్బులే డబ్బులు
ఇక మిగిలిన సగం రూ.24,195కోట్ల డబ్బులను బీసీసీఐ.. క్రికెటర్లకు, స్టేట్ అసోసియేషన్లకు షేర్ చేయనుంది. రెండో సగంలో 26శాతం అంటే రూ.6290కోట్లు దేశీయ, అంతర్జాతీయ ప్లేయర్లకు పంపిణీ చేయబడుతుంది. మిగిలిన 74శాతంలో 4శాతం మేర సిబ్బంది జీతాల కోసం కేటాయించారు. మిగిలిన 70శాతం దేశంలోని యువ ప్రతిభవంతులైన క్రీడాకారులను వెలుగు తీసేందుకు వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు కేటాయిస్తారు. ఈ లెక్కల ప్రకారం సుమారు రూ.6290కోట్లు ప్లేయర్లకు దక్కనుండగా.. రూ.16,936 కోట్లు బీసీసీఐ అనుబంధ రాష్ట్రాల బోర్డులకు అందనున్నాయి.
బీసీసీఐకి ఖజానాకు పైసలే పైసలు
ఇదిలా ఉంటే, గత మూడు రోజులుగా ముంబైలో జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 48,390 కోట్లు చేరాయి. ఫలితంగా క్రీడా చరిత్రలో అతిపెద్ద ప్రసార ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్‌కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. ఇండియా డిజిటిల్ హక్కులను రిలయన్స్ భాగస్వామిగా ఉన్న వయాకామ్18 రూ.20,500 కోట్లకు చేజిక్కించుకుంది.
నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ 'సి'ని కూడా వయాకామ్18 సొంతం చేసుకుంది. వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 410 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. వయాకామ్18 బోధి ట్రీ, లుపా సిస్టమ్స్‌తో కన్సార్షియమ్‌గా ఏర్పడి ఈ వేలంలో పాల్గొంది. ప్యాకేజీ 'డి' (విదేశీ టీవీ, డిజిటల్ హక్కులు)ని వయాకామ్18, టైమ్స్ ఇంటర్నెట్ పంచుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications