For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు: ఏసీయూ విచారణ ఎలా సాగిందో తెలుసా?

By Nageshwara Rao
How the ACU unit of BCCI cleared Mohammed Shami of corruption charges

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసీన్ జహాన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో ఉన్న విధంగానే షమీని 'బి గ్రేడ్' కాంట్రాక్టులో కొనసాగిస్తూ బీసీసీఐ గురువారం అధికారిక ప్రకటన కూడా చేసింది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

తద్వారా షమీ ఇతర ఆటగాళ్లతో పాటు రూ.3 కోట్లు వేతనంగా అందుకోనున్నాడు. అయితే ఈ మొత్తం వ్వవహారంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) ఇచ్చిన నివేదిక ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన అలీష్‌బా అనే మహిళ పంపిన డబ్బును షమీ దుబాయ్‌లో మహ్మద్ భాయ్ వ్యక్తి నుంచి తీసుకున్నట్లు హసీన్ జహాన్ ఆరోపించింది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

భార్య ఆరోపణలతో బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ ఆటగాళ్ల వివరాల జాబితా నుంచి షమీ పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) హెడ్ నీరజ్ కుమార్ విచారణ చేశారు. ఈ విచారణలో షమీ భార్య హసీన్‌ను, మహ్మద్ షమీని, ఆరోపణల్లో పేర్కొన్న వ్యక్తులను బీసీసీఐ అధికారులు ప్రశ్నించారు.

విచారణ పూరైన అనంతరం ఏసీయూ తన నివేదికను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ)కి సమర్పించింది. ఈ నివేదికలో షమీకి ఏసీయూ క్లీన్ చీట్ ఇవ్వడంతో బీసీసీఐ షమీకి తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చింది. విచారణలో ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్‌ ఎవరెవరిని విచారించి నివేదికను రూపొందించారో ఒక్కసారి పరిశీలిద్దాం:

March 7: ఈరోజు, షమీకి తన జీవితంలోని మరచిపోలేని రోజు. తన భర్తకు పలువురు మహిళలతో వివాహేతర సంబధాలున్నాయంటూ, అతడి కుటుంబం తనను చంపేందుకు ప్రయత్నించిందని షమీ భార్య ఆరోపణలు చేయడంతో బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు నుంచి షమీ తప్పించింది.

March 13: షమీపై అతడి భార్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేయడంతో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ) ఈ వ్యవహారంపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) హెడ్ నీరజ్ కుమార్‌ను విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఐపీఎల్ 2018 సీజన్‌లో షమీ ఆడటం అనుమానంగా మారింది.

షమీపై అతడి భార్య చేసిన ఆరోపణలు:
దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని భారత్‌కు వస్తున్న సమయంలో లండన్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ మహమ్మద్ భాయ్ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం దుబాయిలో షమీ పాకిస్థాన్‌కు చెందిన అలీస్‌బా అనే యువతి ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను షమీ ఖండించాడు. విచారణలో భాగంగా ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) సభ్యులు నీరజ్ కుమార్... షమీ, జహాన్(వ్యక్తిగతంగా), అలీస్‌బా, మహమ్మద్ భాయ్‌లను ఫోన్ ద్వారా ప్రశ్నించారు. తద్వారా ఫిక్సింగ్ ఆరోపణలతో షమీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చారు.

ఏసీయూ విచారణ సాగిందిలా:
షమీ: పాకిస్థాన్‌కు చెందిన అలీస్‌బా, లండన్‌కు చెందిన మహమ్మద్ భాయ్ నుంచి నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు.
జహాన్: మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేసేందుకు షమీ డబ్బులు తీసుకున్నాడని నేను ఖచ్చితంగా చెప్పలేను.
అలీస్‌బా: షమీని ఓ అభిమానిగానే కలిశాను. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి మనీ లావాదేవీలు జరగలేదు.
మహమ్మద్ భాయ్: అందరి క్రికెటర్లు మాదిరే షమీ నాకు తెలుసు. అంతేతప్ప అతడితో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదు.

ఈ విచారణ అనంతరం ఏసీయూ సభ్యులు ఐసీసీని కూడా సంప్రదించారు. ఐసీసీ డేటా ప్రకారం చూస్తే అలీస్‌బా, మహమ్మద్ భాయ్‌లు అనుమానితుల జాబితాలో లేరు. దీంతో సీఓఏకి ఇచ్చిన నివేదికలో ఏసీయూ సభ్యులు షమీ ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేశారు.

March 22: షమీ తిరిగి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు పొందాడు.

Story first published: Friday, March 23, 2018, 16:40 [IST]
Other articles published on Mar 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+