
హైదరాబాద్: దేశమంతా అత్యంత గౌరవ పూర్వకంగా చూసుకునే భారత దేశ జెండా చిన్నపిల్లల నుంచి అందరికీ సుపరిచితమైన భారతీయ జెండా తప్పుగా ఎగరేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఏవైనా పోటీలు జరుగుతుంటే ఆతిథ్యం ఇస్తున్న దేశంతో పాటు ఆ టోర్నీలో పాల్గొన్న ఆయా దేశాల జాతీయ జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తుంటాయి.
అలాగే క్రికెట్‌లో ఆతిథ్య దేశ జాతీయ జెండాతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుకు సంబంధించిన జెండా, అలాగే పర్యాటక జట్టు జెండాలు మైదానంలో ఓ పక్కన ఎగురుతూ ఉంటాయి. ఇలాగే ఆతిథ్య దక్షిణాఫ్రికాలో జాతీయ జెండాలు ఎగురేశారు. అయితే మన త్రివర్ణ పతాకాన్ని తిరగేసి ఎగురవేశారు. ఆ తర్వాత గుర్తించి సరి చేశారు. ప్రస్తుతం కోహ్లీ సేన దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
కేప్‌టౌన్‌లో న్యూలాండ్స్‌లో టీమిండియా గత కొద్ది రోజుల నుంచి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది. ఇరుజట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్ మైదానాన్ని సిబ్బంది మ్యాచ్ కోసం సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ఎవరో వచ్చి భారత పతాకాన్ని తప్పుగా ఉంచినట్లు గుర్తించి మైదానం సిబ్బందికి సూచించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకున్నారు. సిబ్బంది తప్పును సరిదిద్దుకునేలోపే ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.