విండిస్ పర్యటనలోనైనా టీమిండియా మిడిలార్డర్ పజిల్ సమస్య తీరేనా?

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ అటు సెలక్టర్లకు ఇటు జట్టు మేనేజ్‌మెంట్‌కు ఓ గుణపాఠాన్ని నేర్పింది. ఈ మెగా టోర్నీలో టాపార్డర్ రాణించడంతో లీగ్ స్టేజిలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మాత్రం ఆదే టాపార్డర్ విఫలం కావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
గతంలో మిడిలార్డర్‌లో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు జట్టుకు మూల స్థంభాల్లాగా నిలిచి మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించేవారు. అలాంటి కీలక మిడిలార్డర్‌లో సరైన ఆటగాడికోసం టీమిండియా గత మూడేళ్లలో 10-12 మంది యువ ఆటగాళ్లను పరీక్షించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో తెలుగు తేజం అంబటి రాయుడు నాలుగో స్థానానికి ఫిట్ అయ్యాడు.

నాలుగో స్థానంలో రాయుడు విఫలం
దీంతో సమస్య తీరిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత రాయుడు ఆ స్థానంలో విఫలం కావడంతో తెరపైకి విజయ్ శంకర్ వచ్చాడు. అతడు కూడా నిరాశ పరిచాడు. మిడిలార్డర్ కోసం కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్‌ను ఎంపిక చేసి ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే, గాయంతో టోర్నీ నుంచి ధావన్ నిష్క్రమించడం... ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కి ప్రమోష్ ఇవ్వడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.

ప్రపంచకప్ ముగిసిన తర్వాత
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 రెండు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దేందు గాను వెస్టిండిస్ పర్యటనకు సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు.

మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో
బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో పాటు బౌలింగ్‌లో నవదీప్ షైనీ, రాహుల్ చహర్, దీపక్ చహర్ వంటి కొత్త వారికి అవకాశమిచ్చారు. ఐపీఎల్‌లో మెరిసిన శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేలు ఇటీవల వెస్టిండీస్ ఎ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లోనూ మంచి ప్రదర్శన చేశారు. దీంతో విండిస్ పర్యటనకు వీరు ఎంపికయ్యారు.

కనీసం ఈ పర్యటనలోనైనా
కనీసం ఈ పర్యటనలోనైనా నాలుగో నెంబర్ స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేసేందుకు వీరికి మంచి అవకాశాలు కల్పించాలి. ఈ స్థానంలో బలమైన బ్యాట్స్‌మెన్‌ను తీర్చిదిద్ది వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలి. కాగా, విండిస్ పర్యటనకు ఎంపికైన మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్‌లను గతంలో నాలుగో నెంబర్ స్థానంలో పరీక్షించారు.

పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు
అయితే వీరిద్దరూ అప్పుడు వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో వీరు సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడైనా ఈ ఇద్దరు ఆటగాళ్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా? లేదా అనుమానంగా ఉంది. అయితే, తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో టీమిండియాకు మిడిలార్డర్ బెంగ తీరినట్లే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications