Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్తగారింటికి వెళ్లి 17 కిలోలు తగ్గాడు! సరికొత్త లుక్ వెనుక సీక్రెట్ ఇదే!

సాధారణంగా అత్తమామల ఇంట్లో ఆతిథ్యం వల్ల అల్లుళ్లు బరువు పెరుగుతారని అంటారు, కానీ భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కాశ్మీర్‌లోని తన అత్తమామల ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత 17 కిలోల బరువు తగ్గాడు. కశ్మీర్‌లోని తన అత్తమామల ఇంటికి వెళ్లిన సర్ఫరాజ్ ఖాన్.. అక్కడ ఏకంగా 17 కిలోల బరువు తగ్గి సరికొత్త ఫిట్నెస్ తో దర్శనమిచ్చాడు. ముంబైకి చెందిన ఈ ఆటగాడికి ఈ రీ-ఎంట్రీకి అతని కఠోర శ్రమ వల్లే జట్టులో చోటు దక్కింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా, గత రెండేళ్లుగా తాను ఎదురుచూస్తున్న భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఆగస్టు 15న ప్రారంభమయ్యే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

షమీ రీ-ఎంట్రీకి మాజీ వరల్డ్ కప్ హీరో గురుమంత్రం!

షమీ రీ-ఎంట్రీకి మాజీ వరల్డ్ కప్ హీరో గురుమంత్రం!

17 కేజీలు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ చాలా ఎక్కువ బరువు ఉన్నాడని భావించేవారు. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్న సర్ఫరాజ్ ఖాన్.. ముంబైలో అకాల వర్షాల వల్ల ప్రాక్టీస్ కు ఆటంకం కలగడంతో కశ్మీర్లోని అత్తగారింటికి వెళ్లాడు.అక్కడ షేర్-ఎ-కాశ్మీర్ స్టేడియంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి గంటల తరబడి గడిపాడు. ఈ కఠిన శిక్షణ ద్వారా ఏకంగా రూ.17 కిలోలు తగ్గి మరింత ఫిట్‌గా మారాడు.

How Sarfaraz Khan Lost 17 kg in Kashmir Ahead of India vs Sri Lanka Test Comeback Full Details

2024లో సర్ఫరాజ్‌ను జట్టు నుంచి తొలగింపు
2024లో న్యూజిలాండ్ జట్టుపై ఆడిన టెస్టుల్లో 4 సార్లు విఫలమైన తర్వాత సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ సిరీస్‌లో ఆటగాళ్లందరూ విఫలమైనప్పటికీ చివరికి ఆ నింద 28 ఏళ్ల సర్ఫరాజ్‌పై పడింది. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ బెకెన్‌హామ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో (ఇండియా వర్సెస్ ఇండియా ఎ) సెంచరీ సాధించడంతో పాటు, ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో ఇండియా ఎ తరఫున 92 పరుగులు కూడా చేశాడు. కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై భారత్ పేలవ ప్రదర్శన కారణంగా జాతీయ జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీ ఓ సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో జట్టులోకి ఎంపిక కావడానికి కొన్ని రోజుల ముందే సోషల్ మీడియాలో "నేను జట్టులో సరిపోకపోవచ్చు. కానీ నా శాయశక్తులా ప్రయతిస్తాను" అంటూ తన పట్టుదలను చాటుకున్నాడు.

IND vs SL: ఆ వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు మళ్లీ మొండి‌చేయేనా?

Also Read

IND vs SL: ఆ వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌కు మళ్లీ మొండి‌చేయేనా?

సాయి సుదర్శన్ కాలికి గాయం కావడంతో సిరీస్ నుంచి తప్పుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు మళ్లీ టీమిండియా తలుపులు తెరుచుకున్నాయి. రెండేళ్ల విరామం అనంతరం లభించిన ఈ అవకాశం సర్ఫరాజ్ ఖాన్ చేసిన కఠోర శర్మకు, సహనానికి లభించిన గుర్తింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Monday, August 10, 2026, 16:48 [IST]
Other articles published on Aug 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+