Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'How's the Josh': పదేళ్ల తర్వాత కప్‌తో న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా (వీడియో)

Hows the Josh chant Indian players after winning ODI series versus New Zealand for first time in 10 years

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై పదేళ్ల తర్వాత వన్డే సిరిస్‌ను నెగ్గడంతో భారత క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కివీస్ గడ్డపై వన్డే సిరిస్‌ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకుని కివీస్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

1967 నుంచి కివీస్‌ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్‌ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఫొటోలకు ఫోజిస్తున్న సందర్భంలో కేదార్ జాదవ్ హౌ ద జోష్ అంటూ గట్టిగా అరిచాడు.

1
44084

దీనికి సహచర క్రికెటర్లు అదే స్థాయిలో హై సార్ అని అనడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఇటీవలే విడుదలైన యురీ-ద సర్జికల్ స్ట్రైక్ సినిమాలోని హౌ ద జోష్ డైలాగ్ సినిమా విడుదల తర్వాత బాగా పాపులర్ అయ్యింది.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విక్కీ కౌశల్.. ఈ డైలాగ్‌తో జవాన్లలో స్ఫూర్తి రగిలిస్తూ ముందుకు సాగడం ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. ఐదో వన్డే అనంతరం కేదార్ జాదవ్ ఇదే డైలాగ్‌తో ఉచ్ఛరించడంతో అందుకు జట్టులోని మిగతా క్రికెటర్లు హై సార్ అని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జట్టులో జోష్ బాగుందంటూ ఫొటో క్యాప్షన్‌తో వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.

Story first published: Monday, February 4, 2019, 12:51 [IST]
Other articles published on Feb 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+