12 ఏళ్ల తర్వాత కలిశా: స్ఫూర్తినిచ్చిన గోస్వామిని కలవడంపై పాక్ పేసర్
హైదరాబాద్: టీమిండియా పేసర్ ఝులన్ గోస్వామిని చూసి తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని పాకిస్థాన్ మీడియం పేసర్ కైనత్ ఇంతియాజ్ తన మనసులోని మాటను బయపపెట్టింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ ఏక్తా బిస్త్ రాణించడంతో పాకిస్థాన్‌పై టీమిండియా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తన ఆరాధ్య క్రికెటర్ ఝులన్ గోస్వామి(భారత్)ని కలుసుకున్నానంటూ కైరత్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
డెర్బీ వేదికగా మ్యాచ్ ముగిసిన అనంతరం భారత వెటరన్ ప్లేయర్ ఝులన్ గోస్వామిని పాక్‌కు చెందిన మీడియం పేసర్ కైరత్ ఇంతియాజ్ కలుసుకుంది. ఈ సందర్భంగా గోస్వామితో కలిసి దిగిన ఫోటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది.
ఆసియాకప్‌లో తొలిసారిగా ఝులన్‌ను చూశాను
అంతేకాదు '2005లో పాకిస్తాన్‌లో జరిగిన ఆసియాకప్‌లో తొలిసారిగా ఝులన్‌ను చూశాను. ఆ సమయంలో ప్రపంచలోనే ఫాస్టెస్ట్ బౌలర్ ఆమె. ఝులన్‌ను చూసి ప్రభావితురాలినై ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ కెరీర్ ఎంచుకున్నాను. పాక్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ద్వారా.. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత నాకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆరాధ్య క్రికెటర్ ఝులన్‌తో మ్యాచ్ ఆడాను. నా కల నిజమైంది' అని పేర్కొంది.

ఎవరీ కైరత్ ఇంతియాజ్
25 ఏళ్ల కైరత్ ఇంతియాజ్ 2011లో పాకిస్థాన్ తరుపున అరంగేట్రం చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో తొలిసారి ఆడుతోంది. అయితే ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంతియాజ్‌కు తుది జట్టులో చోటు లభించలేదు.

ప్రపంచ రికార్డుని నెలకొల్పిన ఝులన్ గోస్వామి
ఇక ఝులన్ గోస్వామి ఇటీవలే ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 180 వికెట్లతో ఆస్ట్రేలియాకు చెందిన కేథిరన్ ఫిజ్‌ఫ్యాట్రిక్ నెలకొల్పిన రికార్డును ఝులన్ అధిగమించింది. ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరిస్‌లో ఝులన్ గోస్వామి ఈ రికార్డుని నెలకొల్పింది. 153 మ్యాచ్‌ల్లో 21.76 యావరేజితో 181 వికెట్లు తీసింది. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్లు, నాలుగు సార్లు 4 వికెట్లు సాధించింది. భారత్‌కు చెందిన మరో బౌలర్ నీతూ డేవిడ్ 141 వికెట్లతో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.

2002లో అరంగేట్రం చేసిన గోస్వామి
2006-07 సీజన్‌లో ఝులన్ గోస్వామి నేతృత్వంలోని టీమిండియా తొలిసారి ఇంగ్లాండ్‌పై టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంది. గోస్వామి 2002లో ఇంగ్లండ్‌పై చెన్నైలో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసింది. 2007లో భారత్‌లో జరిగిన ఆప్రో-ఆసియా టోర్నీలో ఆడిన ఆసియా జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. 2007లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన గోస్వామి ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. వెస్ట్ బెంగాల్‌లో పుట్టిన గోస్వామి 2010లొ అర్జున అవార్డుని, ఆ తర్వాత రెండు సంవత్సరాలకు పద్మశ్రీ అవార్డును అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications