సన్‌రైజర్స్ ఆటగాళ్ల భార్యలకు సింపుల్ క్వశ్చన్స్: ఏం సమాధానాలు చెప్పారంటే!

హైదరాబాద్: గూగ్లీ, ఫ్రీ హిట్, నకుల్ బాల్, సూపర్ ఓవర్... వీటి గురించి ఏ క్రికెట్ అభిమానిని అడిగినా ఠక్కున సమాధానమిస్తాడు. ఇవే ప్రశ్నలు క్రికెటర్ల భార్యలకు ఎదురైతే? వారి ఏం సమాధానాలు చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం కోల్‌కతా-హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయిర్-2 మ్యాచ్ జరగనుంది.

ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసిన హైదరాబాద్
ఈ మ్యాచ్‌కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల భార్యలను ఆ జట్టు యాజమాన్యం ఇవే ప్రశ్నలను అడిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో భాగంగా క్రికెటర్ల భార్యల కోసం సన్‌రైజర్స్ యాజమాన్యం ఓ గేమ్ షో నిర్వహించింది.

గల్లీ, గూగ్లీ, ఫ్రీహిట్, నకుల్ బాల్ అంటే ఏమిటి
ఈ గేమ్ షోలో శిఖర్ ధావన్, టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్, భువనేశ్వర్ కుమార్ తదితరుల భార్యలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్వాహకులు వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో గల్లీ, గూగ్లీ, ఫ్రీహిట్, నకుల్ బాల్, సూపర్ ఓవర్, డాట్ బాల్ అంటే ఏమిటని అడిగారు.
ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఆడుతున్నాయి
దీంతో పాటు చివర్లో ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎన్ని జట్లు ఆడుతున్నాయని చెప్పాలని అడిగారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పగా, మరికొన్నింటిని మాత్రం చెప్పలేకపోయారు. ఈ గేమ్ షోలో పేసర్ భువనేశ్వర్ కుమార్ భార్య నుపూర్ నగర్ చాలా యాక్టివ్‌గా పాల్గొంది. ఎక్కువ ప్రశ్నలకు ఆమే సమాధానాలు చెప్పడం విశేషం.

క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో హైదరాబాద్ Vs కోల్‌కతా
టోర్నీలో భాగంగా శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications